
పటాన్‌చెరు, వెలుగు: బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, పటాన్‌చెరు మండలం చిట్కుల్ సర్పంచ్ నీలం మధు ముదిరాజ్ గిఫ్ట్ ఏ స్మైల్కార్యక్రమంలో భాగంలో గురువారం 50 మంది చిన్నారుల పేరిట రూ.5 వేల చొప్పున ఫిక్స్ డిపాజిట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆడపిల్లలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో తన వంతు సాయం చేస్తున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో పటాన్‌చెరు హెల్త్ ఆఫీసర్ డా.గోపినాయుడు, ఎంపీహెచ్‌వో కృష్ణాప్రసాద్, ఉప-సర్పంచ్ విష్ణువర్ధన్ రెడ్డి, వార్డు సభ్యులు దుర్గయ్య, కృష్ణ, భుజంగం, శ్రీను, మురళి, వెంకటేశ్, రాజ్ కుమార్, యాదగిరి, ఆంజనేయులు, పీఏసీఎస్ మాజీ చైర్మన్ నారాయణ రెడ్డి, బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు ప్రశాంత్, ఎన్ఎంఆర్ యువసేన సభ్యులు పాల్గొన్నారు.