సిట్ కస్టడీకి ఏఈ పేపర్ లీక్​ నిందితులు

సిట్ కస్టడీకి ఏఈ పేపర్ లీక్​ నిందితులు

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : పేపర్ లీకేజీ కేసులో అసిస్టెంట్‌‌‌‌‌‌‌‌ ఇంజనీర్(ఏఈ) పేపర్ లీక్ చేసిన నిందితుల కస్టడీకి నాంపల్లి కోర్ట్‌‌‌‌‌‌‌‌ అనుమతి ఇచ్చింది. వీరిని మంగళవారం నుంచి గురువారం వరకు సిట్ విచారించేందుకు పర్మిషన్ ఇస్తూ సోమవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో నిందితులు రేణుక ఆమె భర్త ధాక్యనాయక్‌‌‌‌‌‌‌‌ ద్వారా ఏఈ పేపర్ లీక్‌‌‌‌‌‌‌‌ అయిన సంగతి తెలిసిందే. మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా నవాబ్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌కు చెందిన ప్రశాంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా షాద్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మండలం నేరెళ్ల చెరువుకు చెందిన రాజేంద్రకుమార్‌‌‌‌‌‌‌‌ ఏఈ పరీక్షలు రాసిన సంగతి తెలిసిందే. వీరిద్దరు ఉపాధి హామీ పథకంలో పనిచేసేవారు.

రాజేంద్రకుమార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహబూబ్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ జిల్లా గండీడ్‌‌‌‌‌‌‌‌ మండలం సల్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పేటకు చెందిన తిరుపతయ్య ద్వారా ఏఈ పేపర్‌‌‌‌‌‌‌‌  కొనుగోలు చేశాడు. రూ.5 లక్షలు ఇచ్చాడు. దీంతో మీడియేటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గా వ్యవహరించిన తిరుపతయ్యను కూడా సిట్‌‌‌‌‌‌‌‌ అధికారులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద ఏఈ పేపర్ లీకేజీకి సంబంధించిన వివరాలు రాబట్టేందుకు కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, మూడ్రోజుల కస్టడీకి అనుమతిచ్చింది. చంచల్‌‌‌‌‌‌‌‌గూడ జైలు నుంచి హిమాయత్‌‌‌‌‌‌‌‌నగర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని సిట్ ఆఫీస్‌‌‌‌‌‌‌‌కి తరలించి ఈ ముగ్గురిని ప్రశ్నించనున్నారు.