గతంలో యూపీలో క్రిమినల్స్ దోపిడీ ఆటలే కనిపించేవి

V6 Velugu Posted on Jan 02, 2022

  • స్పోర్ట్స్ యూనివర్సిటీ  నిర్మాణానికి శంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోడీ

లక్నో: ఉత్తరప్రదేశ్ లోని  మీరట్ లో  మేజర్ ద్యాన్ చంద్  స్పోర్ట్స్ యూనివర్సిటీ  నిర్మాణానికి  శంకుస్థాపన చేశారు  ప్రధానమంత్రి నరేంద్రమోడీ.  గతంలో యూపీలో  క్రిమినల్స్,  మాఫియాల ఆటలు మాత్రమే  కనిపించేవన్నారు  ప్రధాని మోడీ. క్రిమినల్స్ చేసే  దోపిడీల టోర్నమెంట్ లు  జరిగేవన్నారు. కానీ  యోగి ఆదిత్యనాత్  ప్రభుత్వం వచ్చాక  అంతా మారిపోయిందన్నారు . 700 కోట్లతో  నిర్మించే ధ్యాన్ చంద్  యూనివర్సిటీలో  అంతర్జాతీయ  స్థాయి వసతులు కల్పిస్తామన్నారు.  ప్రతీ ఏడాది  వెయ్యి మంది  అమ్మాయిలు, వెయ్యిమంది  అబ్బాయిలు  ఇక్కడ గ్రాడ్యుయేట్స్  అవుతారని చెప్పారు. 

 

 

 

Tagged sports, UP, Uttar Pradesh, Meerut, Prime Minister Modi, games, Major Dhyan Chand, Sports University

Latest Videos

Subscribe Now

More News