- 4,158 సర్పంచ్ స్థానాలకు 27,277,
- 36,442 వార్డులకు 89,603 నామినేషన్లు దాఖలు
- ఈ దఫా 11 సర్పంచ్, 100 వార్డులకు నామినేషన్లు నిల్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. రెండో విడతలో నామినేషన్ల ఉపసంహరణ శనివారం ముగి సింది. ఇక మూడో విడత ఎన్నికల కోసం నామినేషన్ల ప్రక్రియ జోరుగా సాగగా.. శుక్ర వారం (డిసెంబర్ 06) సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పం చ్ స్థానాలకు 17,405, వార్డులకు 61,562 నామినేషన్లు దాఖలవడం విశేషం.
మూడో విడతలో మొత్తం 4,158 గ్రామ పంచాయతీలకు మొత్తం 27,277, 36,442 వార్డులకు 89,603 నామినేషన్లు దాఖలయ్యాయి. ఈ విడత 11 సర్పంచ్, 100 వార్డులకు ఒక్క నామినేషన్ కూడా రాలేదు. కాగా అత్యధికంగా నల్గొండ జిల్లాలో 269 పంచాయతీలకు 1,962, సంగారెడ్డిలో 234 సర్పంచ్ స్థానాలకు 1,344 నామినేషన్లు రాగా.. అత్యల్పంగా ములుగు జిల్లాలో 46 పంచాయతీలకు 242 నామినేషన్లు దాఖలయ్యాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు పంచాయతీ ఎన్నికలకు సంబంధించి హైకోర్టులో కేసు పెండింగ్లో ఉండటంతో అక్కడ ఎన్నికల ప్రక్రియ నిలి చిపోయినట్లు ఎన్నికల ఆఫీసర్లు పేర్కొన్నారు.
మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల జోరు కొనసాగుతున్నా.. కొన్నిచోట్ల మాత్రం బరిలో నిలిచేందుకు అభ్యర్థులు ముం దుకు రాలేదు. మూడో విడతలో ఎన్నికలు జరు గుతున్న పంచాయతీల్లో 11 సర్పంచ్ స్థానాల కు, 100 వార్డు మెంబర్ స్థానాలకు ఒక్క నామి నేషన్ కూడా దాఖలు కాలేదు. ఇందుకు కారణాలేంటనేది స్పష్టంగా తెలియరాలేదు. నామినేష న్లు దాఖలు కానీ స్థానాలపై రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
