పైథాన్‌తో డిన్నర్‌.. వీడియో వైరల్

పైథాన్‌తో డిన్నర్‌.. వీడియో వైరల్

కొండచిలువ (పైథాన్‌ ).. ఈ పేరును వింటేనే చాలామంది భయపడిపోతుంటారు. నిజంగానే కొండచిలువ కళ్లముందు ప్రత్యక్షమైతే అప్పుడు పరిస్థితి ఏంటి..? గుండె ఆగినంత పని అవుతుంది కదూ..! మరి కొండచిలువతోనే డిన్నర్ కు వెళ్తే ఎలా ఉంటుంది మరీ..? ఓ సారి ఊహించుకోండి. వినడానికి కాస్త భయంగానే ఉన్నా.. ఇద్దరు అమ్మాయిలు మాత్రం పైథాన్ తో డిన్నర్ కు వెళ్లి బాగా చిల్ అయ్యారు. 

ఓ లగ్జరీ హోటల్‌లో ఇద్దరు యువతులు పైథాన్ తో కలిసి భోజనం చేస్తూ వీడియోలో కనిపించారు.రద్దీగా ఉన్న రెస్టారెంట్‌లో అమ్మాయిల కూర్చున్న టేబుల్ పై పైథాన్ కనిపిస్తోంది.మరోవైపు ఓ అమ్మాయి తన ముందున్న కొండ చిలువకు స్పూన్ తో ఫుడ్ పెడుతూ కనిపించింది. 

ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వ్యక్తి షేర్ చేశారు. కొండ చిలువకు సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను తెగ ఊపేస్తోంది. దీనిపై నెటిజన్లు తమకు ఇష్టం వచ్చినట్లు కామెంట్లతో కేక పుట్టిస్తున్నారు.

అయితే.. నిజంగానే పైథానా..? లేక బొమ్మ పైథానా..? అనేది మాత్రం క్లారిటీ లేదు. ఈ వీడియో ఎక్కడ తీశారో కూడా ఇన్ స్టాగ్రామ్ లో వీడియో షేర్ చేసిన వ్యక్తి క్లారిటీ ఇవ్వలేదు.