ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తాం: చైనా

ఈ ఏడాది చివరికల్లా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెస్తాం: చైనా

తాము తయారు చేసిన కరోనా వైరస్ వ్యాక్సిన్ డిసెంబర్ నాటికి అందుబాటులోకి రానుందని చైనా ప్రకటించింది. చైనాకు చెందిన  చైనా ప్రభుత్వ ఆస్తుల పర్యవేక్షణ, పరిపాలన కమిషన్‌ (ఎస్‌ఏఎస్‌ఏసీ) తెలిపింది. రాయిటర్స్‌ నివేదిక ప్రకారం.. చైనా సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ వీచాట్‌లో ఎస్‌ఏఎస్‌ఏసీ ఈ సమాచారాన్ని వెల్లడించింది. ఈ నివేదిక ప్రకారం.. వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌లు టీకాను తయారు చేశాయి. రెండు వేల మందికి పైగా రోగులకు ఈ టీకాను ఇచ్చారు. ఈ టీకా ఈ ఏడాది చివరికి లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో మార్కెట్లోకి రావచ్చునని ఎస్‌ఏఎస్‌ఏసీ తెలిపింది. ఈ టీకా క్లినికల్‌ ట్రయల్‌ రెండవ దశకు చేరుకున్నది. వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయోలాజికల్‌ ప్రొడక్ట్స్‌ రెండూ ప్రభుత్వ ఔషధ సంస్థల సమూహం సినోఫార్మ్‌తో అనుబంధంగా ఉన్నాయి. అయితే ఈ వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నానమి, డిసెంబర్ లేదా అంతకంటే త్వరగా వ్యాక్సిన్ ను వినియోగంలోకి తెచ్చేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు.