రెండు వారాల్లో బ్యారెల్​ ధర 100 డాలర్లకు దిగుతుంది

రెండు వారాల్లో బ్యారెల్​ ధర 100 డాలర్లకు దిగుతుంది

చమురు ధరల పెరుగుదల ఎక్కువ కాలం ఇలాగే ఉండదని, రెండు వారాల్లోపు పీపా ధర 100 డాలర్లకు తగ్గుతుందని భారత్​ పెట్రోలియం కార్పొరేషన్​లిమిటెడ్​ (బీపీసీఎల్​) ఎండీ, చైర్మన్​ అరుణ్​ కుమార్​ సింగ్​ అన్నారు. రష్యా–ఉక్రెయిన్​ యుద్ధం పూర్తిగా ముగిస్తే ధర 90 డాలర్లకూ పడిపోవచ్చని పేర్కొన్నారు. ఇండియా భయపడాల్సిన అవసరం లేదని, ఇప్పటికీ రష్యా నుంచి సప్లై ఆగిపోలేదని చెప్పారు. రష్యా తనంత తానుగా సప్లైలను ఆపితేనే సమస్య వస్తుందని, ఆ పరిస్థితి ఎదురు కాకపోవచ్చని చెప్పారు. యూరప్​ కూడా రష్యా నుంచి గ్యాస్​ కొనడం ఆపే అవకాశాలు లేవని అన్నారు. ప్రస్తుతం ఇంటర్నేషనల్ మార్కెట్లో చమురు పీపా ధర 139 డాలర్ల వరకు ఉంది. రష్యా నుంచి చమురు దిగుమతులను నిషేధించే ప్రపోజల్​ను యూఎస్​, యూరప్​దేశాలు పరిశీలిస్తున్నాయని అమెరికా విదేశాంగమంత్రి ఆంటోనీ బ్లింకెన్​ అన్నారు. రష్యా నుంచి దిగుమతులను ఆపే ఉద్దేశం లేదని జర్మనీ స్పష్టం చేయడంతో ధరలు కొంత తగ్గాయి. తమ దగ్గరి నుంచి ఆయిల్​ కొనడం ఆపేస్తే పరిస్థితులు ఘోరంగా మారతాయని, పీపా ధర 300 డాలర్లకు పెరుగుతుందని రష్యా హెచ్చరించింది.