
న్యూ ఇయర్ వేడుకల దృష్ట్యా నగరంలో వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. నగరంలోని ప్రధాన ప్రాంతాల్లో కొన్ని మార్గాలను మూసివేశారు.
నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్డుపై రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు విమానాశ్రయంలో వెళ్లే వాహనాలకు తప్ప ఇతర వాహనాలకు అనుమతి నిషేధించారు.
దీంతో పాటు నగరంలోని పలు ఫ్లై ఓవర్లపై రాకపోకలపై కూడా ఆంక్షలు విధించారు. శిల్పా లే అవుట్ ఫ్లై ఓవర్, మైండ్ స్పేస్ ఫ్లై ఓవర్, రోడ్ నెం. 45 ఫ్లై ఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జీ, సైబర్ టవర్ ఫ్లై ఓవర్, ఫోరమ్ మాల్ జేఎన్ టీయూ ఫ్లై ఓవర్, ఖైతాపూర్ ఫ్లై ఓవర్, బాబు జగ్జీవన్ రామ్ ఫ్లై ఓవర్ బాలానగర్ లలో వాహనాల రాకపోకలను నిషేధించారు.
రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటలకు ఈ ఫ్లై ఓవర్లపై ప్రయాణం నిషేధం. ప్రజలు తమ ప్రయాణ ప్రణాళికలను తదనుగుణంగా రూపొందించుకోవాలని సహకరించాలని అభ్యర్థించారు ట్రాఫిక్ పోలీసులు.