
బషీర్‌బాగ్, వెలుగు: తెలంగాణ రిటైర్డ్వెటర్నరీ అసోసియేషన్ ఆధ్వర్యంలోద్విభాషా త్రైమాసిక జర్నల్ను ఆదివారం ఆవిష్కరించారు. విజయనగర్ కాలనీలోని వెట్స్ హోమ్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి రిటైర్ట్ ఐఏఎస్ డాక్టర్ ఎం.వి. రెడ్డి హాజరై మాట్లాడారు. పాడి రైతుల కోసం ఫీల్డ్ వెటర్నరీ వైద్యులు మ్యాగజైన్ ప్రచురించడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా ఐదుగురు సీనియర్ పశువైద్యులకు పురస్కారాలు అందజేశారు.