ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వాన

 ఆసిఫాబాద్ జిల్లాలో ఎడతెరిపి లేని వాన

ఆసిఫాబాద్, వెలుగు: ఆసిఫాబాద్ జిల్లాలో రెండో రోజు భారీ వర్షం ప్రజా జీవానాన్ని స్తంభింపజేసింది. చింతల మానేపల్లి, బెజ్జూర్, కౌటాల మండలంలో పంటలు నీట మునిగాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న చింతలమానేపల్లి మండలం దిందా వాగును సబ్ కలెక్టర్ శ్రద్ధా శుక్లా పరిశీలించారు. పలు సూచనలు చేశారు. ప్రజలు వాగులు దాటవద్దని, అత్యవసర పరిస్థితుల్లో తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. గూడెం, శివపల్లిలో భారీ వర్షాలకు దెబ్బతిన్న రోడ్లు, బ్రిడ్జిలను తహసీల్దార్ దౌలత్ కుమార్ పరిశీలించారు. స్థానికులు 

మంచిర్యాలలో 23.6 మిల్లీ మీటర్ల వర్షం

మంచిర్యాల, వెలుగు: మంచిర్యాల జిల్లాలో మూడు రోజులుగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 9 నుంచి గురువారం ఉదయం 9 వరకు 24 గంటల్లో 23.6 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా కన్నెపల్లి మండలంలో 48.1, వేమనపల్లి మండలంలో 44.7,  అత్యల్పంగా దండేపల్లి మండలంలో 7.7 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు కన్నెపల్లి మండలంలో 8.8, భీమిని మండలంలో 7.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 

ఎల్లంపల్లికి స్వల్పంగా వరద

జిల్లాలో కురుస్తున్న వర్షాలతో ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి స్వల్పంగా వరద వచ్చి చేరుతుంది. ప్రాజెక్టు కెపాసిటీ 20.175 టీఎంసీలకు గాను ప్రస్తుతం 9.16 టీఎంసీలు నిల్వ ఉంది. ఇన్​ఫ్లో 452 క్యూసెక్కులు అవుట్ ఫ్లో 450 క్యూసెక్కులు కొనసాగుతోంది. 

ఆదిలాబాద్ లో ముసురు

ఆదిలాబాద్, వెలుగు: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా గురువారం ఉదయం నుంచి ముసురువాన కురిసింది. కొద్ది రోజులుగా వర్షాల కోసం ఎదురుచూసిన రైతులకు ముసురు మురిపించింది. ఈ వర్షం పంటలకు మేలు చేయనుంది. వాగులు, చెరువుల్లోకి వరద చేరుతోంది. కుంటాల, పొచ్చర జలపాతాలకు జలకళ వచ్చింది. సాత్నాల, మత్తడి వాగు ప్రాజెక్టుకు వరద తాడికి పెరుగుతోంది.