దశాబ్ది ఉత్సవంలో విషాదం..కరెంట్ ​షాక్​తో కార్మికురాలు మృతి

దశాబ్ది ఉత్సవంలో విషాదం..కరెంట్ ​షాక్​తో కార్మికురాలు మృతి
  • మరో ఇద్దరికి తీవ్ర గాయాలు

నాగర్ కర్నూల్, వెలుగు: తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో విషాదం చోటు చేసుకుంది. జాతీయ జెండా తొలగిస్తుండగా రాడ్డు  కరెంట్​వైర్లపై పడడంతో షాక్​ కొట్టి పంచాయతీ మహిళ కార్మికురాలు చనిపోయింది. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నాగర్ కర్నూల్​జిల్లా పెద్దకొత్తపల్లి మండలం దేవుని తిర్మలాపూర్ పంచాయతీ ఆవరణలో జాతీయ పతాకం ఎగురవేశారు.

సాయంత్రం గ్రామ పంచాయతీ సిబ్బంది రేణుక, చిట్టెమ్మ, బిజినేపల్లి చిట్టెమ్మ జెండా తొలగిస్తుండగా ఇనుప రాడ్ ఒరిగి 11 కేవీ వైర్ల మీద పడింది. దీంతో షాక్​ కొట్టడంతో రేణుక(42) అక్కడికక్కడే చనిపోయింది. మిగిలిన ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో జిల్లా దవాఖానకు తరలించారు. పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.