మెకానిక్‌‌ షెడ్‌‌ పెట్టుకునేందుకు డబ్బులు ఇవ్వలేదని ప్రాణం తీసుకున్నడు !

మెకానిక్‌‌ షెడ్‌‌ పెట్టుకునేందుకు డబ్బులు ఇవ్వలేదని ప్రాణం తీసుకున్నడు !

జైపూర్ (భీమారం) వెలుగు: మెకానిక్‌‌ షెడ్‌‌ ఏర్పాటు చేసుకునేందుకు డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన మంచిర్యాల జిల్లా భీమారంలో ఆదివారం జరిగింది. ఎస్సై శ్వేత తెలిపిన వివరాల ప్రకారం... లంబాడీతండా కాలనీకి చెందిన గాలిపెల్లి రమేశ్‌‌, దేవికల కుమారుడు తారక్‌‌ (19) మంచిర్యాలలోని ఓ కారు మెకానిక్ గ్యారేజీలో పనిచేస్తున్నాడు. 

సొంతంగా మెకానిక్ షెడ్‌‌ ఏర్పాటు చేసుకునేందుకు డబ్బులు కావాలని ఇంట్లో అడిగాడు. దీంతో ప్రస్తుతం ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయని తండ్రి రమేశ్‌‌ చెప్పడంతో మనస్తాపానికి గురైన తారక్‌‌ ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. తండ్రి రమేశ్‌‌ ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.