దొడ్డు వడ్లు కొంటలేరని కౌలురైతు ఆత్మహత్య

దొడ్డు వడ్లు కొంటలేరని కౌలురైతు ఆత్మహత్య
  • పంటపైనే కూర్చుని పురుగుల మందు తాగిండు
  • భూపాలపల్లి జిల్లాలో ఘటన

మహదేవపూర్, వెలుగు: దొడ్డు వడ్లు కొంటలేరని పురుగుల మందు తాగి రైతు పాణం తీసుకున్నడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం సూరారం గ్రామానికి చెందిన గంగారపు బానయ్య (60).. 5 ఎకరాల పొలం కౌలు తీసుకుని సాగు చేస్తున్నాడు. వాతావరణ పరిస్థితులు సహకరించకపోవడంతో దిగుబడి కూడా అంతంతమాత్రంగానే వచ్చింది.

20 రోజులుగా వడ్లు కళ్లంలో పోసి సెంటర్ నిర్వాహకులు కొనుగోలు చేస్తారని చూస్తూ ఉన్నాడు. మిల్లర్లు సన్న రకం వడ్లు మాత్రమే తీసుకుంటున్నారని, కల్లాల్లో ఉన్న దొడ్డు వడ్లను ఎవరూ కొనడానికి ముందుకు రావట్లేదని తోటి రైతులతో చెప్పుకుని బాధపడ్డాడు. మనస్తాపంతో బుధవారం కళ్లంలోనే, తను పండించిన వడ్లపైనే కూర్చుని పురుగుల మందు తాగి పడిపోయాడు. గమనించిన స్థానికులు మహదేవపూర్ సీహెచ్‌‌‌‌సీకి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందాడు.