పాపన్నపేట,వెలుగు: షార్ట్ సర్క్యూట్ తో రేకుల ఇళ్లు దగ్ధమైన సంఘటన మండల పరిధిలోని యూసుఫ్ పేటలో జరిగింది. బాధితుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన కోదండం సాయిలు స్థానిక బుడగజంగం కాలనీలో రేకుల ఇంట్లో నివాసమంటున్నాడు. ఆదివారం పని నిమిత్తం బయటకు వెళ్లగా షార్ట్ సర్క్యూట్ తో ఇంట్లో మంటలు వ్యాపించాయి.
బయటకు పొగ వ్యాపించడంతో స్థానికులు గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వారు అక్కడికి చేరుకొని మంటలు ఆర్పివేశారు. అప్పటికే బీరువాలో ఉన్న డబ్బులు, బంగారం, వెండి వస్తువులు, నిత్యావసర సరుకులు మంటల్లో కాలిపోయాయి. సుమారు రూ.4లక్షల ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు వాపోయాడు.