కారుపై లారీ బోల్తా .. ఇద్దరికి స్వల్ప గాయాలు

కారుపై లారీ బోల్తా .. ఇద్దరికి స్వల్ప గాయాలు
  • శంషాబాద్ పరిధిలో ఘటన

శంషాబాద్, వెలుగు:  కారుపై లారీ బోల్తా పడిన సంఘటన శంషాబాద్ పరిధి తొండుపల్లి బ్రిడ్జి వద్ద చోటుచేసుకుంది. కారు పూర్తిగా ధ్వంసం అవగా అందులోని వారు స్వల్ప గాయాలతో  బయటపడ్డారు. శంషాబాద్ సీఐ శ్రీధర్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని అనంతపూర్ ప్రాంతానికి చెందిన అశోక్ తన టయోటా గ్లాంజా కారులో హైదరాబాద్ వస్తున్నాడు. 

శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని తొండుపల్లి వద్ద లారీ  అతి వేగంగా, అజాగ్రత్తగా వచ్చి అదుపు తప్పి కారుపై బోల్తా పడింది. దీంతో కారు ఇంజిన్ ధ్వంసమైంది. సమాచారం అందడంతో  పోలీసులు అక్కడికి వెళ్లి బాధితులను స్థానిక ఆస్పత్రికి తరలించారు .లారీ డ్రైవర్ పై కేసు నమోదు చేశారు.