హైదరాబాద్లో ఫైల్స్ మిస్సింగ్ కలకలం.. ఒకే రోజు రెండు కేసులు నమోదు

హైదరాబాద్లో ఫైల్స్ మిస్సింగ్ కలకలం.. ఒకే రోజు రెండు కేసులు నమోదు

హైదరాబాద్లో వరుసగా మంత్రుల కార్యాలయాల్లో ఫైల్స్ మిస్సింగ్, ఉద్యోగులు ఫర్నిచర్ తరలిస్తున్న ఘటనలు దుమారం రేపుతున్నాయి. శుక్రవారం (డిసెంబర్8) పశుసంవర్థక శాఖ కార్యాలయంలో మాజీ ఓఎస్డీ ముఖ్యమైన ఫైల్స్ చించి, ఎత్తుకెళ్లినట్లు ఆరోపణలో ఆయనపై కేసు నమోదు చేశారు. తాజాగా బషీర్బాగ్లోని ఆర్జేడీ బిల్డింగ్ లోని మాజీ విద్యాశాఖ మంత్రి కార్యాలయం నుంచి కొంతమంది ఉద్యోగులు ఫర్నీచర్ ఎత్తుకెళ్లేందుకు యత్నించారు. 

ఃఓ ట్రాలీ ఆటోలో కార్యాలయంలోని ఫర్నీచర్ తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అక్కడున్న వారు ప్రశ్నించడంతో అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనాస్థలానికి చేరుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ.. కార్యాలయంలో పనిచేస్తున్న వాచ్ మెన్ ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేశారు సెంట్రల్ జోన్ డీసీపీ శ్రీనివాస్. ఫర్నీచర్ తరలించేందుకు యత్నించిన ఉద్యోగులు, ఆటో కు సంబంధించిన వివరాలు సేకరించాం. దర్యాప్తు చేసి చర్యలు తీసుకుంటామన్నారు డీసీపీ శ్రీనివాస్. 

మరోవైపు శనివారం( డిసెంబర్ 9) పశు సంవర్థక శాఖలో ఫైల్స్ చించి, ఎత్తుకెళ్లిన ఘటనలో మాజీ ఓఎస్డీ కళ్యాణ్ తో సహా సహకరించినసిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. కావాలనే కొన్ని ఫైల్స్ చించి, కొన్నింటిని ఎత్తుకెళ్లినట్లు తెలుస్తోంది. సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని పోలీసులు తెలిపారు.  అక్కడి వాచ్ మెన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నామన్నారు పోలీసులు.