ఇన్ కం ట్యాక్స్ లిమిట్ రూ.7 లక్షలకు పెంపు

ఇన్ కం ట్యాక్స్ లిమిట్ రూ.7 లక్షలకు పెంపు

వేతన జీవులకు కేంద్రం శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు ఊరటనిస్తూ బడ్జెట్లో కీలక ప్రకటన చేశారు. ప్రస్తుతం రూ.5లక్షలుగా ఉన్న ఆదాయపన్ను పరిమితిని రూ. రూ.7 లక్షలకు పెంచుతున్నట్లు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. రూ.3 లక్షల వరకు  ఆదాయం ఉన్నవారు ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. 

ఇన్ కంట్యాక్స్కు సంబంధించి 2020లో ప్రకటించిన 6 శ్లాబుల విధానంలోనూ కేంద్రం మార్పు చేసింది. ఇకపై 5 శ్లాబులు మాత్రమే కొనసాగుతాయని చెప్పారు. రూ.3 నుంచి 6 లక్షల వరకు ఆదాయం ఉన్న వారు 5శాతం, రూ.6 నుంచి 9 లక్షల వరకు 10శాతం,9 నుంచి 12 లక్షల వరకు ఆదాయం ఉంటే 15శాతం, రూ.12 నుంచి 15 లక్షల వరకు 20 శాతం ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. రూ.15 లక్షల ఆదాయం దాటిన వారు 30శాతం ట్యాక్స్ కట్టాల్సిందేనని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు.