
ఆయన ఒక ఐఆర్ఎస్ అధికారి. అందులోనూ మాజీ ఎమ్మెల్యే కుమారుడు. ఆయన భార్య కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగిని. ఆయన పని చేసేది ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసులో. ట్యాక్స్ ఎగవేత దారులను పట్టుకుని వారి నుంచి పన్ను కట్టించాల్సి అధికారే లంచం తీసుకుంటూ పట్టుబడటం ఆదాయపన్ను శాఖ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఆఫీస్ లో ఎక్సెప్షనల్ కమిషనర్‌గా పని చేస్తున్న జీవన్ లాల్.. వైరా మాజీ ఎమ్మెల్యే కుమారుడు. శనివారం (మే 10) లంచం తీసుకుంటూ సీబీఐకి పట్టుబడ్డారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 70 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ సీబీఐకి చిక్కారు.
►ALSO READ | Miss World 2025:హైదరాబాద్లో గ్రాండ్గా మిస్ వరల్డ్ పోటీలు ప్రారంభం
జీవన్ లాల్ 2004లో ఐఆర్‌ఎస్‌కు ఎంపికై ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ లో పని చేస్తున్నాడు. ఒక ప్రైవేటు కంపెనీకి లబ్ది చేకూర్చేవిధంగా వ్యవహరించి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. జీవన్ లాల్‌తో పాటు ఈ కేసుతో సంబంధం ఉన్న శ్రీకాకుళంకు చెందిన శ్రీరామ్ పలిశెట్టి, విశాఖకు చెందిన నట్టవీర నాగశ్రీరామ్, షాపూర్‌జి పల్లోంజికి చెందిన క్రాంతిలాల్ మెహత, మజార్ హుస్సేన్ లను అరెస్టు చేశారు సీబీఐ అధికారులు. ఐదుగురిని హైదరాబాద్ కోర్టులో హాజరుపర్చారు.
జీవన్ లంచాల వ్యవహారంపై హైదరాబాద్, ముంబై, ఖమ్మం, విశాఖ, ఢిల్లీతో పాటు 15 చోట్ల సోదాలు నిర్వహించారు సీబీఐ అధికారులు. వైరా మాజీ ఎమ్మెల్యే కుమారుడు. ఆయన భార్య CISFలో పని చేస్తున్నారు.