షుగర్ మందుల రేట్లు పెంపు

షుగర్ మందుల రేట్లు పెంపు

 

54 డ్రగ్స్ రిటైల్ రేట్లను సవరించిన ఎన్పీపీఏ 

న్యూఢిల్లీ: షుగర్, గుండె జబ్బులు, హైపర్ టెన్షన్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్​కు వాడే మందులు సహా మల్టీ విటమిన్ మెడిసిన్స్ ధరలను కేంద్రం పెంచింది. 54 డ్రగ్ ఫార్ములేషన్స్, 8 స్పెషల్ ప్రొడక్టుల ధరలను సవరిస్తూ నేషనల్ ఫార్మాసూటికల్ ప్రైసింగ్ అథారిటీ(ఎన్పీపీఏ) నిర్ణయం తీసుకుంది. మెట్ ఫార్మిన్, లినాగ్లిప్టిన్, సినాగ్లిప్టిన్ లాంటి షుగర్ మందుల ధరను ఒక్కో ట్యాబ్లెట్​కు రూ.15 నుంచి రూ.20గా ఫిక్స్ చేసింది. సిప్రోఫ్లోక్సాసిన్ ఇంజక్షన్ ధరను మిల్లీలీటర్​కు 23 పైసలుగా నిర్ధారించింది. హైపర్ టెన్షన్​కు వినియోగించే టెల్మిసార్టన్, క్లోర్తాలిడోన్, సిల్నిడిపైన్ మందుల ధరను ట్యాబ్లెట్​కు రూ.7.14 గా ఫిక్స్ చేసింది. ఆస్పిరిన్, అటోర్వాస్టాటిన్ మెడిసిన్స్ ధరను ఒక్కో ట్యాబ్లెట్​కు రూ.2.68గా సవరించింది. కాల్షియం, విటమిన్ డీ3 ధరను ఒక్కో ట్యాబ్లెట్​కు రూ.7.82గా నిర్ధారించింది. గ్లూకోజ్ బాటిల్ ధరను మిల్లీలీటర్​కు 24 పైసలుగా ఫిక్స్ చేసింది.