బార్డర్ లో నిఘా పెంచండి

బార్డర్ లో నిఘా పెంచండి

న్యూఢిల్లీ : టెర్రరిస్టులు భారత్ లోకి చొరబడి కరోనా వైరస్ వ్యాప్తి చేసే ప్రమాదం ఉందన్న ఇంటెలిజెన్స్ హెచ్చరికలతో కేంద్ర హోం శాఖ అప్రమత్తమైంది. పాకిస్తాన్, బంగ్లాదేశ్ బార్డర్ లో నిఘా మరింత పెంచాలని బీఎస్ఎఫ్ ఉన్నతాధికారులను కేంద్రం హోంశాఖ మంత్రి అమిత్ షా ఆదేశించారు. పెన్సింగ్ లేని చోట నిరంతరం అలర్ట్ గా ఉండాలని కోరారు. రెండు దేశాల బార్డర్ ల వద్ద సెక్యూరిటీ అధికారులతో అమిత్ షా శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఈ సందర్భంగా కరోనా వైరస్ వ్యాప్తి చేసేందుకు టెర్రరిస్టులు ప్రయత్నిస్తున్నారన్న సమాచారం ఉందని…కేర్ ఫుల్ గా ఉండాలంటూ వారికి సూచించారు. ఆయా దేశాల నుంచి బార్డర్ దాటి ఒక్కరూ కూడా రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హోంమంత్రి అమిత్ షా కోరారని హోంశాఖ సంయుక్త కార్యదర్శి పీసీ శ్రీవాత్సవ తెలిపారు. సరిహద్దు జిల్లాల్లో అధికారులతో బీఎస్ఎఫ్ కో ఆర్డినేట్ చేసుకుంటుందన్నారు.