సింగూర్ ప్రాజెక్ట్ కు పెరిగిన వరద

సింగూర్ ప్రాజెక్ట్ కు పెరిగిన వరద

పుల్కల్, వెలుగు : ఎగువన ఉన్న కర్ణాటక, మహారాష్ర్టల నుంచి సింగూర్ ప్రాజెక్ట్ లోకి భారీగా వరద వచ్చి చేరుతోంది. దీంతో ఇప్పటికే 7 గేట్ల నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తుండగా, బుధవారం వరద తీవ్రత పెరగడంతో మరో గేటును కూడా అధికారులు ఎత్తి 65294 క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ద్వారా 1577 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.  

ప్రాజెక్ట్ పూర్తి స్థాయి సామర్థ్యం 29.117 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 16.673 టీఎంసీల నీరు నిల్వ ఉందని ఇరిగేషన్ డీఈఈ నాగరాజు, జేఈఈ మహిపాల్ రెడ్డి తెలిపారు. నదీ పరీవాహక ప్రాంతాల్లో ప్రజలు, మత్య్సకారులు, కాపరులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.