అశ్వారావుపేట, వెలుగు: ఆయిల్పామ్ గెలలు ధర భారీగా పెరిగింది. నవంబర్ నెలలో టన్నుకు రూ.19,681 ఉండగా డిసెంబర్లో టన్ను గెలలు ధర రూ.825 పెరిగి రూ.20506కు చేరుకుంది. ఈ నెలలో ఫ్యాక్టరీకి గెలలు తరలించిన రైతులకు ఈ ధర వర్తిస్తుందని ఆయిల్ ఫెడ్ సీనియర్ మేనేజర్ సుధాకర్రెడ్డి మంగళవారం తెలిపారు.
