తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి 18గంటల సమయం..

తిరుమలలో పెరిగిన రద్దీ.. దర్శనానికి 18గంటల సమయం..

కలియుగ వైకుంఠం తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సెలవులు ముగుస్తున్న సమయం కావడం,వీకెండ్ సమయం కావడంతో వేంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోటెత్తిన భక్తులతో కంపార్టుమెంటులు నిండిపోయాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌లోని అన్ని కంపార్టుమెంట్లు నిండి వెలుపల క్యూ లైన్‌లో భక్తులు వేచి ఉన్నారు. 

టోకెన్‌ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోందని సమాచారం.శుక్రవారం నాడు 66,782 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు.36,229 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శుక్రవారం స్వామివారి హుండీ ఆదాయం రూ.3.71 కోట్లు వచ్చిందని సమాచారం.