పెరిగిన రష్ : మల్టీప్లెక్స్..థియేటర్స్​లో వీకెండ్ చిల్

పెరిగిన రష్ : మల్టీప్లెక్స్..థియేటర్స్​లో వీకెండ్ చిల్

100 శాతం సీటింగ్ పర్మిషన్ రావడంతో  పెరిగిన రష్
సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకుంటున్న మేనేజ్ మెంట్స్

హైదరాబాద్,వెలుగు: సిటీలోని థియేటర్లు, మల్లీప్లెక్స్ స్కీన్స్ లో నిర్వాహకులు శనివారం నుంచి 100 శాతం సీటింగ్ తో షోలు నడిపారు. ఈ నెల 4న ప్రభుత్వం 100శాతం ఆక్యుపెన్సీకి పర్మిషన్ ఇవ్వడం, శనివారం వీకెండ్ కావడంతో మూవీ లవర్స్, ఆడియన్స్ తో మల్టీప్లెక్స్, థియేటర్ల వద్ద సందడిగా కనిపించింది.  ఓటీటీ ప్లాట్ ఫామ్ లలో సినిమాలు అందుబాటులోకి వస్తున్నప్పటికి బిగ్ స్క్రీన్ మీద చూస్తేనే బాగుంటుందని మూవీ లవర్స్ చెప్తున్నారు.  సిటీలో ప్రసాద్ ఐమాక్స్, బంజారాహిల్స్ లోని జీవీకే ఐనాక్స్, శరత్ సిటీక్యాపిటల్ మాల్ లోని ఏఎంబీ, ఉప్పల్, అత్తాపూర్, కొంపల్లిలోని ఏషియన్ మూవీస్, మూసాపేట్ లోని ఏషియన్ సినిమాస్, ఎర్రగడ్డలోని గోకుల్, ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని దేవి  , సంధ్య 70ఎంఎం, సప్తగిరి థియేటర్లలో  రష్ ఎక్కువగానే ఉంది.

80శాతం వరకు..

పెద్ద సినిమాలు లేకపోవడంతో 80 నుంచి 85శాతం వరకు ఆడియన్స్ వచ్చారని మల్టీప్లెక్స్ ల మేనేజర్లు తెలిపారు. వీకెండ్ కావడంతో   ఫ్రెండ్స్, ఫ్యామిలీలతో మల్టీప్లెక్స్ లు, థియేటర్లకు సిటీజనాలు క్యూ కట్టారు. కోవిడ్ గైడ్ లైన్స్ కి అనుగుణంగా సింగిల్ స్క్రీన్ థియేటర్ల నుంచి మల్టీప్లెక్స్ లవరకు అన్ని చోట్ల సేఫ్టీ ప్రికాషన్స్ మస్ట్ గా ఫాలో అవుతున్నారు. థియేటర్ పరిసరాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తున్నారు. ఇందుకోసం ఎక్స్ ట్రా స్టాఫ్ ను  నియమించామని మేనేజర్లు చెప్తున్నారు. మునుపటితో పోలిస్తే 100 శాతం ఆక్యుపెన్సీ ఇచ్చాక రష్ పెరిగిందంటున్నారు