హైదరాబాద్‌సిటీ, వెలుగు: మెట్రోవాటర్‌బోర్డు రెవెన్యూను పెంచడానికి నూతన సంస్కరణలను ప్రవేశపెట్టనున్నట్టు బోర్డు ఎండీ అశోక్‌రెడ్డి తెలిపారు. గురువారం జూబ్లీహిల్స్ లోని బోర్డు థీమ్ పార్క్ లో రెవెన్యూ, ఐటీ విభాగ అధికారులతో మేథోమథన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం డొమెస్టిక్ కేటగిరీ కింద ఉన్న వాణిజ్య కనెక్షన్లను గుర్తించాలన్నారు.
జీహెచ్ఎంసీ, ఓఆర్ఆర్ పరిధిలోని నాన్ -రెసిడెన్షియల్ భవనాల జాబితా సేకరించి వాటిని వాటర్ సప్లై కనెక్షన్లతో పోల్చాలని సూచించారు. అనంతరం బోర్డు ఆదాయాన్ని పెంచడానికి కొత్తగా ఏం చేయాలన్న దానిపై ఈడీ మయాంక్ మిట్టల్కలిసి కొత్త సంస్కరణలను ప్రకటించారు. అవసరమైన ప్రాంతాల్లో కనీస బిల్లింగ్‌లో మార్పులు, మీటర్ రీడింగ్ ఏజెన్సీల నియామకం కోసం టెండర్ పిలవడం, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న బకాయిల వసూలు చేయాలని నిర్ణయించారు.
