లాక్ డౌన్ లో టెన్షన్, ఫ్రస్టేషన్..టోల్ ఫ్రీ నంబర్లకు పెరుగుతున్నకాల్స్

లాక్ డౌన్ లో టెన్షన్, ఫ్రస్టేషన్..టోల్ ఫ్రీ నంబర్లకు పెరుగుతున్నకాల్స్

హైదరాబాద్, వెలుగు: లోన్లీ ఫీలింగ్, జాబ్ టెన్షన్, చికాకు, కోపం.. లాక్ డౌన్ లో చాలామంది ఇలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. రోజుల తరబడి ఒకేచోట ఉండటం వల్ల స్ట్రెస్ ఫీల్​అవుతున్నారు. తెలియని వారితో ఆ బాధను పంచుకోవాలనుకుంటున్నారు. ఆర్గనైజేషన్స్, మెడిటేషన్​ సెంటర్ల టోల్ ఫ్రీ నంబర్లకు కాల్​చేసి గోడు వెల్లబోసుకుంటున్నారు. ఇలాంటి కాల్స్​ డైలీ వందల్లో ఉంటున్నాయి.

ఐయామ్ హియర్.. నో ఫియర్

లాక్ డౌన్ టైమ్​లో కొందరు మానసిక ఆందోళనతో ఉంటున్నారు. అలాంటి వారి కోసం సిటీకి చెందిన కొన్ని సంస్థలు టోల్​ఫ్రీ నంబర్లు అందుబాటులో ఉంచాయి. ‘లైఫ్ ఆఫ్ గర్ల్’ అనే స్టార్టప్ కంపెనీ www.iamherenofear.com అనే వెబ్ సైట్ డిజైన్ చేసింది. అందులో ఓ ర్యాండమ్ పర్సన్ తో ఇంకో ర్యాండమ్ పర్సన్ కాల్ మాట్లాడుతారు. ఒంటరితనాన్ని పోగొట్టడానికి, స్ట్రెస్ లెవల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంటారు. ఇక్కడ పనిచేస్తున్న 20 మంది వలంటీర్లలో కార్పొరేట్ ఎంప్లాయీస్, ఎక్స్ పర్ట్స్, సెలబ్రిటీస్, హోమ్ మేకర్స్ ఉన్నారు. డైలీ 20–30 రిక్వెస్ట్ లు వస్తుండగా, ప్రాబ్లమ్ ఇంపాక్ట్ ని బట్టి వలంటీర్లతో మాట్లాడిస్తున్నారు. కాల్ ​చేస్తున్న వారిలో 16 –21, 25 –30 ఏండ్ల వాళ్లే ఉంటున్నారు. జాబ్ పోతుందనే టెన్షన్, లోన్లీనెస్, వర్క్ ప్రెజర్ లాంటి రీజన్స్ తో ఎక్కువ మంది ఫోన్​చేస్తున్నట్టు వలంటీర్లు చెప్తున్నారు.

మెడిటేషన్ తో రిలాక్స్..

స్ట్రెస్, వర్క్ ప్రెజర్ నుంచి రిలీఫ్ పొందా లంటే మెడిటేషన్ బెస్ట్ ఆప్షన్ అంటున్నారు హార్ట్ ఫుల్ నెస్ మెడిటేషన్ సెంటర్ నిర్వాహకులు. లాక్ డౌన్ స్టార్ట్ అయిన తర్వాత వాళ్లకు వందల మెయిల్స్ రావడంతో టోల్ ఫ్రీ నంబర్ 18001213492, మిస్డ్ కాల్ నంబర్ 8938589295 అందుబాటులోకి తెచ్చారు. మానసికంగా బాధపడుతున్న వారు ఆ నంబర్లకు కాల్ చేస్తుండగా.. ట్రైనర్లు, వలంటీర్లుగా  ఉన్న డాక్టర్లు, సైకాలజిస్ట్ లు, ఎక్స్ పర్ట్స్  వారితో మాట్లాడుతున్నారు. డైలీ 30కిపైగా కాల్స్ రిసీవ్ చేసుకుంటున్నారు. ఇప్పటివరకు 450కిపైగా కాల్స్ వచ్చినట్లు నిర్వాహకులు తెలిపారు. ఫోన్​ చేస్తున్న వారిలో ఫ్యామిలీ ప్రెజర్స్, సూసైడ్ థాట్స్, వర్క్ స్ట్రెస్, యాంగ్జైటీ ఫీలవుతున్న వారు ఎక్కువగా ఉన్నట్టు వారు తెలిపారు. మెడిటేషన్, లైఫ్ గురించి పాజిటివ్ సజెషన్స్ ఇచ్చి మైండ్ సెట్ ని మార్చేందుకు ట్రై చేస్తున్నట్లు పేర్కొన్నారు. నిర్వాహకులు వాట్సాప్