Cricket World Cup : సెమీస్ లో ఇండియా, పాకిస్తాన్ తలపడనున్నాయా.. అలా జరగాలంటే ఏం జరగాలి..?

Cricket World Cup : సెమీస్ లో ఇండియా, పాకిస్తాన్ తలపడనున్నాయా.. అలా జరగాలంటే ఏం జరగాలి..?

క్రికెట్ వరల్డ్ కప్ లో అద్భుతాలకు కొదవ లేదు.. చిన్న జట్టు కదా అని సిల్లీగా తీసేయటానికి అస్సలు లేదు.. ఆఫ్ఘనిస్తాన్ గెలుస్తున్న తీరే ఇందుకు నిదర్శనం. ఓటములతో అల్లాడుతున్న పాకిస్థాన్ జట్టు.. సెమీస్ చేరే అవకాశాలూ లేకపోలేదు. అదే జరిగితే.. ఇండియా, పాకిస్తాన్ మధ్య సెమీస్ సమరం ఉండనుంది. ఇదే జరిగితే వరల్డ్ కప్ ఫైనల్స్ మ్యాచ్ కంటే ముందే.. ఫైనల్ మ్యాచ్ అనేది ఖాయం.. సెమీస్ లో ఇండియా వర్సెస్ పాక్ మ్యాచ్ జరగాలంటే.. వరల్డ్ కప్ మ్యాచుల్లో ఏ జట్టు.. ఏ జట్టుపై గెలవాలి.. ఏ జట్టు ఓడిపోవాలి.. ఈక్వేషన్స్ ఏంటో చూద్దాం..

>>> ప్రస్తుతం ఇండియా ఫస్ట్ ప్లేస్ లోఉంది.. ఇది ఫిక్స్.. నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో సెమీఫైనల్ ఆడాల్సి ఉంటుంది. 
>>> ప్రస్తుతం నాలుగో స్థానంలో న్యూజిలాండ్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ జట్లు ఉన్నాయి. 
>>> ఇంగ్లాండ్, పాకిస్తాన్ మ్యాచ్ లో పాకిస్తాన్ గెలవాలి.. ఇంగ్లాండ్ ఓడిపోవాలి
>>> శ్రీలంక, న్యూజిలాండ్ మ్యాచులో.. న్యూజిలాండ్ ఓడిపోవాలి.. శ్రీలంక గెలవాలి.
>>> ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఈ మ్యాచ్ తోపాటు సౌతాఫ్రికాతో తలపడనుంది. ఈ రెండు మ్యాచుల్లోనూ ఆఫ్గనిస్తాన్ జట్టు కచ్చితంగా ఒకటి ఓడిపోవాలి. అప్పుడు పాయింట్ల పరంగా ఆప్గనిస్తాన్ నాలుగో స్థానం అనుకున్నా.. రన్ రేటు మైనస్ లో ఉండటంతో.. పాకిస్తాన్ నాలుగో ప్లేస్ లోకి వస్తుంది. 

ఈ నాలుగు జట్ల రిజల్ట్ ఆధారంగా ఇండియా, పాకిస్తాన్ సెమీఫైనల్ మ్యాచ్ ఉంటుంది. ప్రస్తుతానికి అయితే ఎవరూ ఊహించని విధంగా ఆఫ్ఘనిస్తాన్ జట్టు సంచలన విజయాలు నమోదు చేస్తుంది. ఒక వేళ ఆఫ్ఘనిస్తాన్ జట్టు రెండు మ్యాచులు ఓడిపోతే ఇంటికెళ్లిపోతుంది. ఇదే సమయంలో శ్రీలంక, పాకిస్తాన్, న్యూజిండ్, ఇంగ్లాండ్ జట్లు ఆడే రెండు మ్యాచ్ ఫలితాలపై.. ఇండియా, పాక్ మ్యాచ్ ఆధారపడి ఉంది.

క్రికెట్ ప్రపంచంలో గెలుపోటములు ఎలా ఉంటాయి అనేది ఇప్పుడే ఊహించటం కష్టం.. ఏమైనా జరగొచ్చు కదా.. మరి పాకిస్థాన్ ఇండియా 2023 వరల్డ్ కప్ లో సెమీ ఫైనల్లో తలపడతాయో లేదో చూడాలి.