IND vs AUS: ఆసిస్ విలవిల..విజయం దిశగా భారత్

IND vs AUS: ఆసిస్ విలవిల..విజయం దిశగా భారత్

ఆస్ట్రేలియాతో జరుగుతోన్న  తొలి టెస్టు మూడో రోజు ఆట కొనసాగుతోంది. భారత బౌలర్లు చెలరేగుతున్నారు.  బౌలర్ల దాటికి ఆసిస్ మూడో రోజే ఆట ముగిసేలా కనిపిస్తుంది. ఎందుకంటే  రెండో ఇన్నింగ్స్ లో ఆసిస్ ఇప్పటికే  75 పరుగులు చేసి  8  వికెట్లు కోల్పోయింది.  ఇంకా రెండు వికెట్లు  పడగొడ్తే  ఈ టెస్టులో భారత్ దే విజయం.   స్పిన్నర్ అశ్విన్ దాటికి ఆసిస్ బ్యాటర్లు పెవిలియన్ బాట పట్టారు. అశ్విన్ 5 వికెట్లు తీసి ఆసిస్ నడ్డి విరిచాడు. రవీంద్ర జడేజా రెండు వికెట్లు, అర్ పటేల్ ఒక వికెట్  తీశాడు. దీంతో ఆసిస్ 30 ఓవర్లు ముగిసే సరికి 8 వికెట్లు కోల్పోయి 87 పరుగులు చేసింది.  ఇంకా 136 పరుగుల వెనుకంజలో ఉంది. భారత్ తొలి ఇన్నింగ్స్ లో 400 పరుగులకు ఆలౌట్ అవ్వగా..ఆసిస్ తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకు ఆలౌట్ అయ్యింది.