
557 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లాండ్ తడబడుతోంది. 28 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 పరుగుల వద్ద క్రాలీని బుమ్రా పెవియన్ చేర్చగా.. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో బెన్ డకెట్(4) రనౌట్ రూపంలో వెనుదిరిగాడు. దీంతో 18 పరుగులకే ఇంగ్లాండ్ ఓపెనర్లిద్దరినీ కోల్పోయింది.
ఆపై కొద్దిసేపటికే ఓలీ పొప్(3).. జడేజా బౌలింగ్ లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. ఆ తదుపరి ఓవర్‌లోనే బెయిర్ స్టో(4) ఎల్బీడబ్ల్యూ రూపంలో ఔటయ్యాడు. దీంతో ఇంగ్లాండ్ 28 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఇప్పటివరకూ జడేజా 2 వికెట్లు తీసుకోగా.. బుమ్రా ఒక వికెట్ పడగొట్టాడు. ప్రస్తుతం జో రూట్(5 నాటౌట్), బెన్ స్టోక్స్(1 నాటౌట్) క్రీజులో ఉన్నారు.
England lose both their openers before tea! https://t.co/uNRzS8VZ65 | #INDvENG pic.twitter.com/XIxt1km1x4
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2024
అంతకుముందు యశస్వి జైశ్వాల్(214; 236 బంతుల్లో 14 ఫోర్లు, 12 సిక్స్ లు) డబుల్ సెంచరీ సాధించడంతో టీమిండియా 430 పరుగుల వద్ద ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.
Youngest players to score two double centuries in Tests:
— ESPNcricinfo (@ESPNcricinfo) February 18, 2024
21y 54d - Vinod Kambli
21y 318d - Don Bradman
??? ??? - ???????? ???????
22y 173d - Graeme Smith pic.twitter.com/14lmJ39U3B