IND vs ENG 5th Test: శభాష్ అశ్విన్..! వందో టెస్టులో ఆసక్తికర సన్నివేశం

IND vs ENG 5th Test: శభాష్ అశ్విన్..! వందో టెస్టులో ఆసక్తికర సన్నివేశం

ధర్మశాల టెస్టు తొలిరోజు మైదానంలో ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో చెలరేగడంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 218 పరుగులకే కుప్పకూలింది. దాంతో ఆటగాళ్లందరూ డ్రెస్సింగ్ రూమ్ వైపు అడుగులు వేశారు. ఆ సమయంలో కుల్దీప్.. కెరీర్‌లో వందో టెస్ట్ ఆడుతున్న ర‌విచంద్రన్ అశ్విన్‌ చేతికి బంతిని అందించాడు. వందో టెస్టు కనుక గుర్తుగా ఉంచుకోవాలన్న ఉద్దేశ్యంతో అలా చేశాడు. అయితే, అశ్విన్ అందుకు అంగీకరించలేదు. 5 వికెట్లు పడగొట్టిన కుల్దీపే అందుకు అర్హుడని, జట్టును అతనే డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిపించాలని తేల్చి చెప్పాడు. 

సాధారణంగా ఐదు వికెట్లు తీసిన బౌలర్ బంతిని జ్ఞాపకంగా ఉంచుకొని, జట్టును డ్రెస్సింగ్ రూమ్ వైపు నడిపిస్తాడు. దశాబ్ధాల కాలంగా ఇదొక ఆనవావాయితీగా వస్తోంది. అది తన వల్ల విచ్చిన్నం కాకూడదనే ఉద్దేశ్యంతో అశ్విన్ అలా చేశాడు. ఆ సన్నివేశం అటు అభిమానులను, ఇటు జట్టు సహచరులను భావోద్వేగానికి గురిచేసింది.

ALSO READ :- IND vs ENG 5th Test: రోహిత్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు.. తొలి రోజే తేలిపోయిన ఇంగ్లాండ్

క్రాలే టాప్ స్కోర‌ర్‌

టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన ఇంగ్లాండ్ ను భారత స్పిన్నర్లు కుల్దీప్ యాద‌వ్, ర‌విచంద్ర‌న్ అశ్విన్‌లు తిప్పేశారు. ట‌ర్నింగ్ పిచ్ పై వీరిని ఎదుర్కోవడానికి ఇంగ్లాండ్ బ్యాటర్లకు ప్రత్యామ్నాయమే లేకుండా పోయింది. కనీసం క్రీజులో నిలబడలేకపోయారు. దీంతో  ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 218 ప‌రుగుల‌కే ఆలౌటయ్యింది. ఓపెన‌ర్ జాక్ క్రాలే(79 ) టాప్ స్కోర‌ర్‌గా నిలిచాడు. మాంత్రికుడు కుల్దీప్ 5 వికెట్లు ప‌డ‌గొట్టగా, కీరీర్‌లో వందో టెస్టు ఆడుతున్న అశ్విన్ 4 వికెట్ల‌తో స‌త్తా చాటాడు.