IND vs ENG 5th Test: రోహిత్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు.. తొలి రోజే తేలిపోయిన ఇంగ్లాండ్

IND vs ENG 5th Test: రోహిత్, జైస్వాల్ హాఫ్ సెంచరీలు.. తొలి రోజే తేలిపోయిన ఇంగ్లాండ్

భారత్ ఇంగ్లాండ్ ల మధ్య జరుగుతున్న ధర్మశాల టెస్టులో తొలి రోజు టీమిండియా పూర్తి ఆధిపత్యం చూపించింది. మొదట బౌలింగ్ లో ఆ తర్వాత బ్యాటింగ్ లో సత్తా చాటి తొలి రోజే పట్టు బిగించింది. తొలి రోజు ఆట ముగిసేసమయానికి వికెట్ నష్టానికి 135 పరుగులు చేసింది. క్రీజ్ లో కెప్టెన్ రోహిత్ శర్మ (52), శుభమాన్ గిల్(26) ఉన్నారు. ప్రస్తుతం భారత్ తొలి ఇన్నింగ్స్ లో 83 పరుగులు వెనకపడి ఉంది. 

ఇంగ్లాండ్ తక్కువ పరుగులేకే ఆలౌట్ చేసి బ్యాటింగ్ ప్రారంభించిన భారత్ కు ఓపెనర్లు రోహిత్ శర్మ , జైస్వాల్ సూపర్ స్టార్ ఇచ్చారు. ఇంగ్లాండ్ బౌలర్లను చితక్కొడుతూ తొలి వికెట్ కు సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పారు. 

ALSO READ :- MS Dhoni: ధోని జ్ఞాపకాన్ని ఇంట్లో భద్రంగా దాచాను..: సునీల్ గవాస్కర్

ఓ ఎండ్ లో రోహిత్ శర్మ ఆచితూచి ఆడుతుంటే మరో ఎండ్ లో జైస్వాల్ తనకే సాధ్యమైన దూకుడుతో ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. తొలి వికెట్ కు 104 పరుగుల భాగస్వామ్యం తర్వాత జైస్వాల్ 57 పరుగులు చేసి బషీర్ బౌలింగ్ లో స్టంపౌటయ్యాడు. ఆ తర్వాత క్రీజ్ లోకి వచ్చిన గిల్, రోహిత్ శర్మ మరో వికెట్ పడకుండా తొలి రోజును ముగించారు. 

అంతకముందు ఇంగ్లాండ్ తమ తొలి ఇన్నింగ్స్ లో 218 పరుగులకే ఆలౌటైంది. క్రాలే 79 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలవగా.. మిగిలిన ఏ ఒక్కరు కూడా 30 పరుగుల మార్క్ టచ్ చేయలేకపోయారు.ఒక దశలో వికెట్ నష్టానికి 100 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లాండ్.. 118 పరుగుల వ్యవధిలో తమ చివరి 9 వికెట్లను కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 5 వికెట్లు తీసుకొని ఇంగ్లాండ్ పతనాన్ని శాసించగా.. వందో టెస్ట్ ఆడుతున్న అశ్విన్ నాలుగు వికెట్లు పడగొట్టాడు. జడేజాకు ఒక వికెట్ దక్కింది.