ODI World Cup 2023: భారత బౌలర్లు కుట్ర పన్నారు.. విచారణ జరిపించాలి: పాక్ మాజీ క్రికెటర్

ODI World Cup 2023: భారత బౌలర్లు కుట్ర పన్నారు.. విచారణ జరిపించాలి: పాక్ మాజీ క్రికెటర్

గురువారం వాంఖడే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభించిన విషయం తెలిసిందే. మహమ్మద్ షమీ, సిరాజ్ పదునైన పేస్‌కు లంక  బ్యాటర్లు కుదేలైపోయారు. 358 పరుగుల లక్ష్య ఛేదనలో కనీస పోరాటం కూడా చేయలేకపోయారు. 55 పరుగులకే లంకను కుప్పకూలి.. ఏకంగా 302 పరుగుల తేడాతో ఓటమిని అంగీకరించారు. అయితే టీమిండియా సాధించిన ఈ విజయం పాక్ మాజీ క్రికెటర్లకు రుచించడం లేదు. భారత బౌలర్లపై వారు నిందలు మోపుతున్నారు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో భారత బౌలర్లు వేరే బంతితో బౌలింగ్ చేశారని పాక్ మాజీ ఆటగాడు హసన్‌ రజా సంచలన ఆరోపణలు చేశాడు. ఐసీసీ, బీసీసీఐ కుమ్మక్కై భారత బౌలర్లకు ప్రత్యేక బంతులు ఇస్తున్నాయంటూ పిచ్చి వాగుడు వాగాడు. అందువల్లే భారత పేసర్లు ఇతర జట్ల బౌలర్లతో పోలిస్తే అధిక సీమ్‌ను, స్వింగ్‌ను రాబట్టగలుగుతున్నారంటూ తన నోటికొచ్చిందల్లా వాగాడు. అంతేకాదు, ఈ విషయంపై దర్యాప్తు జరపాలని కోరాడు. భారత్‌-శ్రీలంక మ్యాచ్‌ ముగిసిన అనంతరం ఓ పాక్‌ టీవీ ఛానల్‌లో హసన్ రజా ఈ వ్యాఖ్యలు చేశాడు.

కాగా, హసన్‌ రజా చేసిన వ్యాఖ్యలపై భారత క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారత జట్టు సాధిస్తున్న విజయాలను ఓర్వలేక ఇలాంటి పిచ్చి వాగాడు వాగుతున్నాడని చెప్తున్నారు. ఇలాంటి వారి మాటల వల్ల పాకిస్తాన్ పరువు మరింత దిగజారుతుందని, కనీసం ఆ దేశ అభిమానవులైనా వీరిని అదుపులో పెట్టాలని సూచిస్తున్నారు. 

కాగా, పాక్‌ తరఫున 7 టెస్ట్‌లు, 16 వన్డేలు ఆడిన ఈ  మాజీ క్రికెటర్.. అతిపిన్న వయసులో (14 ఏళ్ల 233 రోజులు) అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తద్వారా అతిపిన్న వయసులో క్రికెట్‌లోకి అరంగ్రేటం చేసిన ఆటగాడిగా రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

ALSO READ :- IND vs SL: శ్రేయాస్ అయ్యర్ భారీ సిక్స్.. స్క్రీన్ పై చాహల్ భార్య!