న్యూఢిల్లీ, వెలుగు: నిజామాబాద్ జిల్లాలో ఇందల్వాయి~సిర్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్వోబీ) నిర్మాణానికి లైన్ క్లియరైంది. సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోని హైదరాబాద్ డివిజన్, సికింద్రాబాద్ - ముద్ఖేడ్ సెక్షన్‌లో గల ఎల్‌సీ నంబర్ 198 వద్ద నిర్మించనున్న ఈ ప్రాజెక్టును కేంద్ర ప్రభుత్వం 'ప్రత్యేక రైల్వే ప్రాజెక్టు'గా గుర్తించింది. ఈ మేరకు మంగళవారం గెజిట్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది.
రైల్వే చట్టం-1989లోని సెక్షన్ 2 (37ఏ) ప్రకారం... ప్రజా ప్రయోజనాల దృష్ట్యా జాతీయ మౌలిక సదుపాయాల కల్పనలో భాగంగా ప్రాజెక్టును చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. నోటిఫికేషన్ ఆధారంగా ఆర్వోబీ నిర్మాణానికి అవసరమైన భూమిని సేకరించేందుకు వీలుకలుగనుంది. గెజిట్ ప్రచురించిన తేదీ నుంచి భూసేకరణ ప్రక్రియ అమలులోకి వస్తుందని గెజిట్లో పేర్కొంది.
