స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం
  • హాజరైన హైకోర్టు చీఫ్​ జస్టిస్ అపరేశ్,​సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు, పలు పార్టీల నేతలు
  • ఎట్​ హోంకు బీఆర్​ఎస్​ దూరం  

హైదరాబాద్, వెలుగు: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజ్​భవన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో శుక్రవారం సాయంత్రం ఎట్ హోం కార్యక్రమం ఆహ్లాదకరమైన వాతావరణంలో జరిగింది. ఈ కార్యక్రమానికి హైకోర్టు చీఫ్​ జస్టిస్​ అపరేశ్​ కుమార్​ సింగ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్కతోపాటు పలువురు మంత్రులు, మాజీ గవర్నర్​ దత్తాత్రేయ  హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు మంత్రివర్గ సహచరులను సీఎం రేవంత్ రెడ్డి పరిచయం చేశారు.

అలాగే, కార్యక్రమానికి హాజరైన వివిధ పార్టీల నేతల వద్దకు వెళ్లి వారిని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు. బీజేపీ ఎంపీలు కె.లక్ష్మణ్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు. బీజేపీ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికైన రాంచందర్ రావును సీఎం రేవంత్ రెడ్డి పలకరించారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు ప్రభుత్వ ఉన్నతాధికారులు సైతం ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. కాగా, ఎట్​హోం కార్యక్రమానికి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎవరూ హాజరు కాలేదు.

గవర్నర్​తో సీఎం ప్రత్యేక భేటీ 

గవర్నర్​ జిష్టుదేవ్ వర్మతో  సీఎం రేవంత్​ రెడ్డి పది నిమిషాల పాటు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. గవర్నర్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు ప్రత్యేకంగా బర్త్​ డే విషెస్​​ తెలిపారు. అనంతరం పంచాయతీరాజ్​ చట్టం 2018 సవరణ ఆర్డినెన్స్​ అంశాన్ని సీఎం ప్రస్తావించినట్టు తెలిసింది.