స్వతంత్ర్య వజ్రోతవాల ముగింపు కార్యక్రమం

స్వతంత్ర్య వజ్రోతవాల ముగింపు కార్యక్రమం

గాంధీ వేషధారణతో ఆకర్షణగా 750 మంది విద్యార్థులు  

చౌటుప్పల్, వెలుగు: గాంధీ సూచించిన శాంతి, అహింస మార్గంలోనే పలు దేశాలు స్వాతంత్య్రం  సాధించాయని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ సంస్థ చైర్మన్ గున్నా రాజేందర్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లోని స్వతంత్ర్య వజ్రోతవాల ముగింపు కార్యక్రమాన్ని గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ అండ్​గాంధీ ప్రతిష్టాన్ ​ట్రినిటి  స్కూలు సంయుక్తగా నిర్వహించాయి. ఇందులో 750 మంది విద్యార్థులు గాంధీ వేషధారణతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

ఈ సందర్భంగా గాంధీ గ్లోబల్ ​ఫ్యామిలీ చైర్మన్​రాజేందర్​రెడ్డి మాట్లాడుతూ మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలా, ఐన్​స్టీన్ ​లాంటివారు గాంధీ సిద్ధాంతాలకు ప్రభావితమై ఆయనను గురువుగా భావించారన్నారు. గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ చైర్మన్ ప్రధాన కార్యదర్శి యానాల ప్రభాకర్ రెడ్డి, కార్యదర్శి గూనా రెడ్డి, మారం భిక్షారెడ్డి, మహిళా కన్వీనర్ వై రాధిక, సీఐ శ్రీనివాస్, ట్రినిటి స్కూల్ చైర్మన్ కేవీపీ కృష్ణారావు పాల్గొన్నారు.