సిటీలో స్వాతంత్ర వజ్రోత్సవాల జోష్

సిటీలో స్వాతంత్ర వజ్రోత్సవాల జోష్

హైదరాబాద్: స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా గ్రేటర్ వ్యాప్తంగా సంబురాలు కొనసాగుతున్నాయి.  శనివారం జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో బల్దియా హెడ్డాఫీసు నుంచి ట్యాంక్ బండ్ వరకు ఫ్రీడమ్ రన్ నిర్వహించగా.. అధికారులు,  ఎంటమాలజీ, శానిటేషన్ సిబ్బంది, డీఆర్​ఎఫ్​ టీమ్స్, ఎన్​సీసీ స్కూల్స్​, కాలేజీల స్టూడెంట్లు.. సుమారు 15 వేల మంది పాల్గొన్నారు. ఈ ర్యాలీని మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్, వజ్రోత్సవ కమిటీ రాష్ట్ర చైర్మన్ కేశవరావు,  మేయర్, డిప్యూటీ మేయర్లు విజయలక్ష్మి, శ్రీలతా రెడ్డి, కమిషనర్ లోకేశ్ కుమార్ ప్రారంభించారు.

పరేడ్ గ్రౌండ్​లో ఆర్మీ జవాన్లు చేసిన విన్యాసాలు ఆకట్టుకున్నాయి.దుర్గం చెరువుపై ఉన్న కేబుల్ బ్రిడ్జి వద్ద సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర బైక్ రైడ్​ను ప్రారంభించారు. పద్మారావునగర్​లో చేపట్టిన తిరంగా పాదయాత్రలో విమెన్ సేఫ్టీ వింగ్ డీఐజీ సుమతి పాల్గొన్నారు.- జీడిమెట్ల ఇండస్ట్రియల్ ఏరియాలో అసోసియేషన్ ఆధ్వర్యంలో రైతుబజార్ వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించగా.. డిప్యూటీ చీఫ్ ఇన్ స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీనివాస్ రెడ్డి  పాల్గొన్నారు.  నార్త్​జోన్​ పోలీసుల ఆధ్వర్యంలో ఉప్పల్​, సికింద్రాబాద్, కంటోన్మెంట్​ ప్రాంతాల్లో ఫ్రీడమ్ ర్యాలీ నిర్వహించగా.. బీజేపీ కార్పొరేటర్లు దీపిక, సుచిత్ర పాల్గొన్నారు. మల్కాజిగిరి,శంషాబాద్, వికారాబాద్, పరిగిలోనూ ర్యాలీలు జరిగాయి.