హెచ్ఐసీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు..

హెచ్ఐసీసీలో స్వాతంత్ర్య వజ్రోత్సవ ముగింపు వేడుకలు..

హైదరాబాద్ లోని హెచ్ఐసీసీలో స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల ముగింపు వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా సీఎం కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.  భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా కళారూపాల ప్రదర్శన నిర్వహించారు. 

భారత దేశం ఉన్నతమైన నాగరికతకు చిహ్నమని.. బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా సాగిన పోరాటం ప్రపంచాన్ని కదిలించిందన్నారు  సీఎం కేసీఆర్. ఎందరో స్వాతంత్య్ర పోరాట యోధుల త్యాగాలు ఎప్పటికీ స్ఫూర్తిదాయం అన్నారు సీఎం. మతసామరస్యం కోసం మహాత్ముడు జీవితాంతం పోరాటం చేశారన్నారు. మార్టిన్ లూథర్ కింగ్, నెల్సన్ మండేలాకు మహాత్మాగాంధీ స్ఫూర్తి అని అన్నారు సీఎం.  

తెలంగాణ ఏర్పాటు అడ్డుకునేందుకు ఎందరో ప్రయత్నాలు చేశారు.. మహాత్ముని అడుగు జాడల్లో తెలంగాణను శాంతియుతంగా సాధించుకున్నామని అన్నారు సీఎం కేసీఆర్. సకల జనులకు సమానంగా ప్రగతి ఫలాలను అందించడమే లక్ష్యంగా పనిచేస్తున్నాం.. అప్పుడే సకల జనుల అభివృద్ధి సాధ్యమవుందని సీఎం కేసీఆర్ అన్నారు.