- ఇండిపెండెంట్ అభ్యర్థి వినూత్న మ్యానిఫెస్టో
గద్వాల, వెలుగు: కాలనీలోని పేద ఆడపిల్ల పెళ్లికి 10,116, పేదవారు ఎవరైనా చనిపోతే మట్టి ఖర్చులకోసం 10వేలు, కాలనీలోని ఒకటో తరగతి నుంచి పదో తరగతి చదివే స్టూడెంట్ లకు ఫ్రీ మెటీరియల్ ఇస్తామంటూ ఇండిపెండెంట్ అభ్యర్థి ఎండీ కలీం మ్యానిఫెస్టో ను విడుదల చేశారు.
తాను నమ్ముకున్న పార్టీలో తనకు టికెట్ రాలేదని అయినప్పటికీ ప్రజలకు సేవ చేసేందుకు ముందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు. సొంత ఖర్చులతో కాలనీ మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తానని, శాశ్వతంగా డ్రైనేజీ సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
