గన్నేరువరం, వెలుగు: కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం చాకలివనిపల్లె గ్రామ సర్పంచ్‌గా స్వతంత్ర అభ్యర్థి 68 వృద్ధురాలు రేపాక బానవ్వ ఐదు ఓట్ల తేడాతో విజయం సాధించారు. దీంతో గ్రామంలో పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు సంబురాలు జరుపుకుంటున్నారు. సర్పంచ్ స్థానం కోసం నలుగురు అభ్యర్థులు పోటీ పడగా బానవ్వ విజయం సాధించారు.
