స్వతంత్ర అభ్యర్థిగా వేల్పుల గాలయ్య నామినేషన్

స్వతంత్ర అభ్యర్థిగా వేల్పుల గాలయ్య నామినేషన్

చండూరు, వెలుగు: నోట్లకు ఓట్లను కొనేందుకు రెడీ అయిన అగ్రకుల పార్టీలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమయ్యాయని దళిత్ శక్తి ప్రోగ్రాం రాష్ట్ర అధ్యక్షుడు డా.విశారదన్ మహారాజ్ మండిపడ్డారు. శుక్రవారం రాత్రి చండూరులో డీఎస్​పీ బలపరిచిన స్వతంత్ర అభ్యర్థి వేల్పుల గాలయ్య నామినేషన్ తర్వాత నిర్వహించిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ బీజేపీలు రెడ్డి వర్గానికే టికెట్ ఇవ్వడం దుర్మార్గమన్నారు. మునుగోడును ఏలడానికి బీసీ ఎస్సీ, ఎస్టీలకు అర్హత లేదా అని ప్రశ్నించారు. అందుకే అణగారిన వర్గాల తరఫున స్వతంత్ర అభ్యర్థి నారాయణపూర్ మండలం పుట్టపాకకు చెందిన ఏర్పుల గాలయ్యను బలపరుస్తున్నామన్నారు. నామినేషన్ కార్యక్రమానికి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి జనాలు తరలివచ్చారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుర్గాప్రసాద్,  హరీశ్​గౌడ్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు రెహమాన్, అగ్గిమల్ల గణేశ్,  కృష్ణా నాయక్, అశోక్ యాదవ్, రాఘవేంద్ర ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మణ్, శివన్, వంశీ,గిరి, శ్రీకాంత్, రమేష్,  రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు.