V6 News

సూర్యవంశీపై ఫోకస్.. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌19 ఆసియా కప్.. తొలి పోరులో యూఏఈతో ఇండియా ఢీ

సూర్యవంశీపై ఫోకస్.. అండర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌19 ఆసియా కప్.. తొలి పోరులో యూఏఈతో ఇండియా ఢీ

దుబాయ్: యంగ్‌‌‌‌‌‌‌‌ సెన్సేషన్స్  వైభవ్ సూర్యవంశీ, కెప్టెన్ ఆయుష్ మాత్రేతో కూడిన ఇండియా అండర్-19 జట్టు ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో తమ టైటిల్ వేటను ప్రారంభించనుంది. శుక్రవారం యూఏఈతో జరిగే తొలి మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో శుభారంభమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. 

అండర్ 19 వరల్డ్ కప్‌‌‌‌‌‌‌‌కు సన్నాహకంగా భావిస్తున్న ఈ  టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌పై సర్వత్రా ఆసక్తి నెలకొనగా. ఆదివారం జరగబోయే ఇండియా– -పాకిస్తాన్ మ్యాచ్‌‌‌‌‌‌‌‌పైనే సర్వత్రా దృష్టి ఉంది. గత సీనియర్ టోర్నీల్లో మాదిరిగా ఈసారి కూడా ఇండియా కుర్రాళ్లు పాక్ ఆటగాళ్లతో షేక్ హ్యాండ్‌‌‌‌‌‌‌‌ కు నిరాకరిస్తారా లేదా? అనేది చర్చనీయాంశమైంది. 

క్రీడాస్ఫూర్తిని పాటిస్తూ రాజకీయాలకు తావు లేకుండా సాధారణ ప్రోటోకాల్‌‌‌‌‌‌‌‌ను పాటించాలని  ఐసీసీ కోరుకుంటున్నట్లు సమాచారం. ఈ విషయాలు పక్కనబెడితే ఇండియానే ఈ టోర్నమెంట్‌‌‌‌‌‌‌‌లో ఫేవరెట్‌‌‌‌‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. సూర్యవంశీ, మాత్రే ఇద్దరూ ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అత్యుత్తమ ఫామ్‌‌‌‌‌‌‌‌ చూపెట్టారు. ముఖ్యంగా సూర్యవంశీ ఆ చరిత్రలోనే యంగెస్ట్‌‌‌‌‌‌‌‌ సెంచూరియన్‌‌‌‌‌‌‌‌గా నిలిచాడు. ఈ ఇద్దరు ఆటగాళ్లకు మూడు ఫార్మాట్లలో కలిపి 30కి పైగా సీనియర్ లెవెల్ మ్యాచ్‌‌‌‌లు ఆడారు.