బ్యాంకాక్: విమెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా–ఎ సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన గ్రూప్–ఎ చివరి పోరులో 7 వికెట్ల తేడాతో నేపాల్‌పై ఘన విజయం సాధించి గ్రూప్ టాపర్‌గా నాకౌట్ చేరింది. తొలుత ఇండియా స్పిన్నర్ల దెబ్బకు నేపాల్ 18 ఓవర్లలో 78 రన్స్‌కే కుప్పకూలింది.
తనూజ కన్వర్ (4/12), మిన్ను మణి (3/8), కెప్టెన్ రాధా యాదవ్ (2/17) దెబ్బకొట్టారు. సంఝానా ఖడ్కా (22) టాప్ స్కోరర్. అనంతరం వ్రింద దినేష్ (39 నాటౌట్) మెరుపు బ్యాటింగ్‌తో ఇండియా 7.5 ఓవర్లలోనే 82/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది.
