ఆఫ్ఘన్ బౌలర్లపై భారత్– ఏ బ్యాటర్ల దండయాత్ర.. 319 పరుగుల టార్గెట్!

ఆఫ్ఘన్ బౌలర్లపై భారత్– ఏ బ్యాటర్ల దండయాత్ర.. 319 పరుగుల టార్గెట్!

India A vs Afghanistan A: త్రైపాక్షిక సిరీస్‌లో  (Tri-Nation Series) భాగంగా ఆఫ్ఘనిస్తాన్-ఏ జట్టుతో జరుగుతున్న ఐదో మ్యాచ్‌లో  భారత్– ఏ యంగ్ బ్యాటర్లు క్లాస్ అండ్ మాస్ ఇన్నింగ్స్‌లతో చెలరేగిపోయారు. దంబుల్లా వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆఫ్ఘనిస్తాన్-ఏ కెప్టెన్ ఇమ్రాన్ మీర్ మొదట ఫీల్డింగ్ తీసుకోగా.. బ్యాటింగ్‌కు దిగిన ఇండియన్ కుర్రాళ్లు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 319 పరుగుల భారీ స్కోరు సాధించారు.

వైభవ్ ఫ్లాప్ షో.. నిగమ్ మెరుపులు: 
యువ ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ ఈ మ్యాచ్‌లో కూడా పెద్ద ఇన్నింగ్స్ ఆడటంలో మరోసారి విఫలమయ్యాడు. మ్యాచ్‌లో లక్ బాగుండి రెండుసార్లు లైఫ్‌లైన్స్ దొరికినప్పటికీ.. దాన్ని వాడుకోలేక కేవలం 38 పరుగులకే అవుట్ అయి తీవ్ర నిరాశపరిచాడు. కానీ మరో ఎండ్ లో ప్రియాంశ్ ఆర్య మాత్రం తన మార్క్ షాట్లతో హాఫ్ (58 పరుగులు) చేసిన తర్వాత ఔట్ అయ్యాడు. 

అనంతరం క్రీజులోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ బాధ్యతాయుతంగా ఆడుతూ అర్ధ శతకం ( 59 పరుగులు) పూర్తి చేసుకున్న తర్వాత భారీ షాట్ ఆడబోయి బౌండరీ లైన్ వద్ద ఆఫ్ఘన్ ఫీల్డర్ చేతికి చిక్కడంతో మైదానం వీడాడు. ఆ తర్వాత వచ్చిన కుమార్ కుశాగ్ర కూడా ఆఫ్ఘన్ బౌలర్లపై ఎటాక్ చేస్తూ 58 రన్స్ కొట్టి టీమ్ స్కోరును పరుగులు పెట్టించే క్రమంలో డగౌట్ కి చేరుకున్నాడు. 

ALSO READ : వైభవ్‌ను ఔట్ చేసి నోరు మూయాలన్నట్లు ఆఫ్ఘన్ బౌలర్ సిగ్నల్

ఫినిషింగ్ టచ్: 
ఒకానొక దశలో వికెట్లు పడుతున్నా.. చివర్లో వచ్చిన విప్రాజ్ నిగమ్ కేవలం 20 బంతుల్లో 30 పరుగులు చేసి మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. ఇండియా-ఏ జట్టు 300 పరుగుల మార్కును దాటడంలో విప్రాజ్ ఆడిన ఈ ఇన్నింగ్స్ చాలా కీలక పాత్ర పోషించింది. దీంతో 50 ఓవర్లలో భారత్ ఏ జట్టు 8 వికెట్లు కోల్పోయి 319 పరుగులు చేసింది. ఆఫ్ఘన్ బౌలర్లలో ఫర్మానుల్లా సఫీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, ఫరీదూన్ దావూద్‌జాయ్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.