హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఫ్యామిలీ Vs ఇండివిడ్యువల్ మధ్య తేడాలు తెలియకపోతే నష్టపోతారు

హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటున్నారా? ఫ్యామిలీ Vs ఇండివిడ్యువల్ మధ్య తేడాలు తెలియకపోతే నష్టపోతారు

హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ప్రతి కుటుంబానికి అత్యవసరమైన ఒక ఫైనాన్షియల్ ప్రొటెక్షన్. అయితే పాలసీ తీసుకునేటప్పుడు చాలామంది ఎదుర్కొనే అతిపెద్ద కన్ఫ్యూజన్.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకోవాలా? లేక అందరికీ విడివిడిగా ఇండివిడ్యువల్ ప్లాన్స్ తీసుకోవాలా? అని. ఈ రెండు ప్లాన్ల మధ్య ఉన్న తేడాలు.. వాటి వల్ల కలిగే లాభనష్టాలు క్లియర్ గా తెలుసుకుంటే భవిష్యత్తులో డబ్బుతో పాటు టెన్షన్ కూడా ఆదా అవుతుంది.

ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ అంటే ఏంటి?
ఈ ప్లాన్‌లో కుటుంబ సభ్యులందరికీ కలిపి ఒకే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఉదాహరణకు మీరు రూ.5 లక్షల ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకుంటే.. ఆ రూ.5 లక్షల మొత్తాన్ని కుటుంబంలో ఉన్న ఎవరైనా, ఎంతైనా వాడుకోవచ్చు. ఒకే సంవత్సరంలో ఒకరి కంటే ఎక్కువ మంది హాస్పిటల్ పాలైనా ఈ సింగిల్ కవరేజ్ నుంచే క్లెయిమ్ చేసుకోవాలి. యువకులు, ఆరోగ్యంగా ఉండే చిన్న కుటుంబాలకు ఇది బెస్ట్ ఆప్షన్.

ఇండివిడ్యువల్ ప్లాన్ అంటే ఏంటి?
ఈ ప్లాన్ పేరులోనే ఉన్నట్టుగానే ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరికీ విడివిడిగా సపరేట్ కవరేజ్ అమౌంట్ ఉంటాయి. ఒకరికి ఇచ్చిన కవరేజ్ మొత్తాన్ని కుటుంబంలోని మిగతా సభ్యులు వాడుకోవడానికి వీలుండదు. ఎవరి పరిమితి వారికి  ఉంటుంది. కాబట్టి ఒకరు పెద్ద మొత్తంలో క్లెయిమ్ చేసినా.. మిగతా వారి కవరేజ్ అలాగే ఉంటుంది.

ALSO READ : 13 గుండెలు.. 360 డిగ్రీ వ్యూ.. ఊపిరితిత్తులు లేకుండానే శ్వాస..

ఖర్చు ఎందులో తక్కువ?
బడ్జెట్ విషయానికి వస్తే.. ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్స్ చాలా చౌకగా లభిస్తాయి. ఒకే ప్రీమియంతో భార్యాభర్తలు, పిల్లలను కవర్ చేయవచ్చు. అదే ఇండివిడ్యువల్ ప్లాన్స్ అయితే ప్రతి ఒక్కరికీ విడివిడిగా ప్రీమియం కట్టాలి కాబట్టి ఖర్చు కొంచెం ఎక్కువగా ఉంటుంది. 

తల్లిదండ్రులను యాడ్ చేయవచ్చా?
ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్ తీసుకునేటప్పుడు లేదా రెన్యూవల్ చేసేటప్పుడు తల్లిదండ్రులను డిపెండెంట్స్‌గా యాడ్ చేసుకోవచ్చు. కానీ పాలసీలో సీనియర్ సిటిజన్లు ఉంటే ప్రీమియం రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి. పైగా వయసు పైబడిన వారికి తరచూ వైద్య సేవలు అవసరమవుతాయి కాబట్టి, వారు ఎక్కువ మొత్తం క్లెయిమ్ చేస్తే పిల్లలకు కవరేజ్ మిగలకపోవచ్చు. అందుకే తల్లిదండ్రులకు విడిగా ఇండివిడ్యువల్ పాలసీ తీసుకోవడమే సేఫ్.

మీకు ఏది కరెక్ట్?
హెల్త్ ఇన్సూరెన్స్‌లో అందరికీ ఒకే రూల్ వర్తించదు. మీ కుటుంబంలో అందరూ యంగ్‌గా ఉండి, మెడికల్ రిస్క్‌లు తక్కువగా ఉంటే.. తక్కువ ప్రీమియంతో వచ్చే 'ఫ్యామిలీ ఫ్లోటర్' ప్లాన్ ఎంచుకోవడం స్మార్ట్ ఛాయిస్. అలా కాకుండా ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా, లేదా ఎవరికైనా తరచూ చికిత్సలు అవసరమయ్యే ఆరోగ్య సమస్యలు ఉన్నా.. 'ఇండివిడ్యువల్' ప్లాన్స్ వైపు వెళ్లడమే అత్యుత్తమం. మీ ఫ్యామిలీ వయస్సు, ఆరోగ్య పరిస్థితులను బట్టి సరైన నిర్ణయం తీసుకోండి.