3 గోల్స్‌తో మెస్సీ మ్యాజిక్.. మమ్మల్ని ఆపడం అంత ఈజీ కాదు.. ప్రత్యర్థులకు కోచ్ స్కలోనీ స్ట్రాంగ్ మెసేజ్

3 గోల్స్‌తో మెస్సీ మ్యాజిక్.. మమ్మల్ని ఆపడం అంత ఈజీ కాదు.. ప్రత్యర్థులకు కోచ్ స్కలోనీ స్ట్రాంగ్ మెసేజ్

Lionel Messi Hat Trick: డిఫెండింగ్ ఛాంపియన్ అర్జెంటీనా ఫిఫా వరల్డ్ కప్ 2026లో తమ తొలి మ్యాచ్‌లోనే అదిరిపోయే రేంజ్‌లో బోణీ కొట్టింది. లెజెండరీ ప్లేయర్ లియోనెల్ మెస్సీ (Lionel Messi) గ్రౌండ్‌లో హ్యాట్రిక్ గోల్స్‌తో చెలరేగిపోవడంతో.. అల్జీరియాపై అర్జెంటీనా 3–0 తేడాతో ఘన విజయం సాధించింది. ఈ అద్భుతమైన విక్టరీ తర్వాత అర్జెంటీనా కోచ్ లియోనెల్ స్కలోని టీమ్‌పై ఫుల్ కాన్ఫిడెన్స్‌గా ఉన్నప్పటికీ, ప్లేయర్స్ అస్సలు రిలాక్స్ అవ్వద్దంటూ ఒక గట్టి వార్నింగ్ కూడా ఇచ్చాడు.

కోచ్ స్కలోని వార్నింగ్: 
కోచ్ లియోనల్ స్కలోని మాట్లాడుతూ.. ఈ వరల్డ్ కప్‌లో మనం గనుక కొద్దీగా ఓవరాక్షన్ చేసిన ఏ ప్రత్యర్థి అయినా మనల్ని ఓడించగలరనే విషయం ఈ టీమ్‌కు బాగా తెలుసు.. కానీ, మనం మన ఆటను పర్‌ఫెక్ట్‌గా ఆడుకుంటూ వెళ్తే.. మనల్ని ఓడించడం ఎవరికైనా చాలా కష్టం.. కప్ గెలవడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాలి, కానీ విక్టరీతో టోర్నీని స్టార్ట్ చేయడం వల్ల టీమ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుందని స్కలోని పేర్కొన్నాడు.

హిస్టరీ క్రియేట్ చేసిన మెస్సీ: 
38 ఏళ్ల వయసులోనూ మెస్సీ ఆడిన ఆట చూసి ఫుట్‌బాల్ ప్రపంచం షాక్ అవుతోంది. అల్జీరియాపై కొట్టిన హ్యాట్రిక్‌తో మెస్సీ రికార్డులను తిరగరాశాడు. 

* వరల్డ్ కప్ హిస్టరీలోనే టాప్ రన్-గెట్టర్: ఈ హ్యాట్రిక్‌తో మెస్సీ వరల్డ్ కప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ చేసిన ప్లేయర్‌గా జర్మనీ దిగ్గజం మిరోస్లావ్ క్లోజ్ (16 గోల్స్) రికార్డును సమం చేశాడు.

ALSO READ : ఓల్వాన్ మైండ్ బ్లోయింగ్ గోల్ కొట్టినా..

* రొనాల్డో, ఎంబప్పేలు రికార్డే బ్రేక్: ఈ ప్రాసెస్‌లో మెస్సీ బ్రెజిల్ లెజెండ్ రొనాల్డో (15 గోల్స్), జర్మనీకి చెందిన గెర్డ్ ముల్లర్ (14 గోల్స్)లను దాటేశాడు. ఇక ఫ్రాన్స్ స్టార్ ప్లేయర్ కిలియన్ ఎంబప్పే (14 గోల్స్) అంతకుముందే సెనెగల్‌పై రెండు గోల్స్ కొట్టి ముల్లర్ రికార్డును సమం చేసినప్పటికీ, మెస్సీ ఇప్పుడు అందరి కంటే ముందు నిలిచాడు.

* ఓల్డెస్ట్ హీరో రికార్డ్: 38 ఏళ్ల 357 రోజుల వయసులో వరల్డ్ కప్‌లో ఒకే మ్యాచ్‌లో హ్యాట్రిక్ (Hat-trick) గోల్స్ సాధించిన అత్యంత వృద్ధ ఆటగాడిగా మెస్సీ మెన్స్ వరల్డ్ కప్ హిస్టరీలోనే సరికొత్త రికార్డ్ క్రియేట్ చేశాడు.

* క్రిస్టియానో రొనాల్డో రికార్డ్ బ్రేక్: 2018 రష్యా వరల్డ్ కప్‌లో స్పెయిన్‌పై 33 ఏళ్ల వయసులో హ్యాట్రిక్ కొట్టి.. ఓల్డెస్ట్ హ్యాట్రిక్ స్కోరర్‌గా నిలిచిన పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో రికార్డును మెస్సీ ఇప్పుడు బద్దలు కొట్టాడు.
 

అర్జెంటీనా నెక్స్ట్ మ్యాచులు: 
జూన్ 21న ఆస్ట్రియా వర్సెస్ అర్జెంటీనా
జూన్ 27న జోర్డాన్‌ వర్సెస్ అర్జెంటీనా