జూన్ 21 నుంచి TG టీ20 లీగ్.. బుద్ధ విగ్రహం వద్ద ట్రోఫీ ఆవిష్కరణ

జూన్ 21 నుంచి TG టీ20 లీగ్.. బుద్ధ విగ్రహం వద్ద ట్రోఫీ ఆవిష్కరణ

తెలంగాణలో జూన్ 21 నుంచి జరగనున్న టీజీ టీ20 లీగ్  విన్నర్  ట్రోఫీని  హుస్సేన్ సాగర్ బుద్ధ విగ్రహం దగ్గర ఆవిష్కరించారు.  ఉప్పల్ స్టేడియంలో జరగబోయే ఓపెనింగ్ సెర్మనీకి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ (Thaman) మ్యూజికల్ కాన్సర్ట్ తో  పాటు నెక్స్ట్ లెవెల్ లేజర్ షో ప్లాన్ చేశారు.

విన్నర్ టీమ్ కి రూ. కోటి ప్రైజ్ మనీ:

ఈ లీగ్ మొత్తం 8 జట్లు తలపడనున్నాయి. ప్రతి టీమ్ మిగతా అన్ని జట్లతో ఒక్కో మ్యాచ్ ఆడుతుంది (రౌండ్-రాబిన్ ఫార్మాట్).. ప్రైజ్ మనీ కూడా భారీ ప్రకటించారు.
* కప్ గెలిచిన టీమ్కు (Winner): రూ.1 కోటి
* రన్నరప్ (Runner-up) కి: రూ.50 లక్షలు
* 3, 4 ప్లేస్లలో నిలిచే జట్లకు: రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్ మనీ

ఐపీఎల్లోని క్రేజీ రూల్:

ఐపీఎల్లో ఉండే ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ తప్ప మిగతా అన్ని ఐపీఎల్ రూల్స్ ఈ లీగ్లోనూ ఉంటాయి. పైగా మ్యాచ్ టికెట్ ధరలు కేవలం రూ.50, రూ.100 మాత్రమే ఉండనున్నాయి. డిస్ట్రిక్ట్ యాప్ (District App)లో అందుబాటులో ఉన్నాయి.

టోర్నీ ఫస్ట్ మ్యాచ్లో పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు ఢీకొట్టబోతున్నాయి. ఇక రామోజీ గ్రూప్నకు చెందిన ఉషోదయ ఎంటర్ప్రైజెస్ ఓన్ చేసిన హైదరాబాద్ ఈ ఛాంపియన్స్ (Hyderabad e Champions) టీమ్.. జూన్ 23న పాలమూరు స్ట్రైకర్స్తో త ఫస్ట్ మ్యాచ్ ఆడనుంది.