పుదుచ్చెరి: ఆస్ట్రేలియా–ఎతో జరుగుతున్న నాలుగు రోజుల మ్యాచ్‌లో ఇండియా–ఎ జట్టు 363 రన్స్ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీన్ని ఛేదించేందుకు గురువారం మూడో రోజు బరిలోకి దిగిన ఆసీస్ ఆట ముగిసే టైమ్‌కు రెండో ఇన్నింగ్స్‌లో 23 ఓవర్లలో 55/2 స్కోరు చేసింది. నాథన్ మెక్‌స్వీని (23 బ్యాటింగ్), పీటర్ హ్యాండ్స్‌కోంబ్ (0 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. సామ్ కాన్‌స్టాస్ (20), క్యాంప్‌బెల్ కెల్లావే (0) నిరాశపర్చారు. ఆసీస్ గెలవడానికి ఇంకా 308 రన్స్ చేయాల్సి ఉంది.
అంతకుముందు రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఇండియా–ఎ బ్యాటింగ్‌లో తడబడింది. దాంతో 57.4 ఓవర్లలో 199 రన్స్‌కే ఆలౌటైంది. దేవదత్ పడిక్కల్ (59), కుమార్ కుశాగ్ర (46 నాటౌట్), సాయి సుదర్శన్ (39) మినహా మిగతా వారు ఫెయిలయ్యారు. టాడ్ మర్ఫి 4, బ్రెండన్ డాగెట్ 2 వికెట్లు పడగొట్టారు.
