మళ్లీ ఓడిన హాకీ టీమ్‌‌

మళ్లీ ఓడిన హాకీ టీమ్‌‌

ఆమ్‌‌స్టర్‌‌డామ్ (నెదర్లాండ్స్): యూరోప్‌‌ టూర్‌‌లో ఇండియా–ఎ మెన్స్ హాకీ జట్టుకు వరుసగా రెండో ఓటమి ఎదురైంది. మంగళవారం జరిగిన హోరాహోరీ పోరులో  2–3 తేడాతో ఇంగ్లండ్ చేతిలోపరాజయం పాలైంది. 

ఇండియా యంగ్ ఫార్వర్డ్స్‌‌ మణిందర్ సింగ్, ఉత్తమ్ సింగ్ గోల్స్ చేసినప్పటికీ,  వరల్డ్‌‌ ఐదో ర్యాంకర్ ఇంగ్లండ్ చేతిలో ఓటమి తప్పలేదు.  ఇండియా–ఎ టీమ్ గురువారం జరిగే తదుపరి మ్యాచ్‌‌లో బెల్జియంతో తలపడనుంది. ఈ నెల 18, 20వ తేదీల్లో  నెదర్లాండ్స్‌‌తో చివరి రెండు మ్యాచ్‌‌ల్లో పోటీ పడనుంది.