సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లాపై విక్టరీ..  మెరిసిన నిశాంత్‌‌‌‌‌‌‌‌, మానవ్‌‌‌‌‌‌‌‌, ధుల్

సెమీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో బంగ్లాపై విక్టరీ..  మెరిసిన నిశాంత్‌‌‌‌‌‌‌‌, మానవ్‌‌‌‌‌‌‌‌, ధుల్

కొలంబో: లెఫ్టార్మ్‌‌‌‌‌‌‌‌ స్పిన్నర్లు నిశాంత్‌‌‌‌‌‌‌‌ సింధు (5/20), మానవ్‌‌‌‌‌‌‌‌ సుతార్‌‌‌‌‌‌‌‌ (3/32) మ్యాజిక్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఏసీసీ ఎమర్జింగ్‌‌‌‌‌‌‌‌ మెన్స్‌‌‌‌‌‌‌‌ ఆసియా కప్‌‌‌‌‌‌‌‌లో ఇండియా–ఎ ఫైనల్‌‌‌‌‌‌‌‌ చేరుకుంది. శుక్రవారం జరిగిన సెమీస్‌‌‌‌‌‌‌‌లో 51 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో బంగ్లాదేశ్‌‌‌‌‌‌‌‌–ఎపై గెలిచింది. తొలుత ఇండియా 49.1 ఓవర్లలో 211 రన్స్‌‌‌‌‌‌‌‌కు ఆలౌటైంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌ యశ్‌‌‌‌‌‌‌‌ ధుల్‌‌‌‌‌‌‌‌ (66) ఫిఫ్టీ కొట్టగా, అభిషేక్‌‌‌‌‌‌‌‌ శర్మ (34), సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ (21), మానవ్‌‌‌‌‌‌‌‌ సుతార్‌‌‌‌‌‌‌‌ (21) రాణించారు. అనంతరం ఛేజింగ్‌‌‌‌‌‌‌‌లో బంగ్లా 34.2 ఓవర్లలో 160 రన్స్‌‌‌‌‌‌‌‌కే కుప్పకూలింది.

ఓపెనర్లు తంజిద్‌‌‌‌‌‌‌‌ హసన్‌‌‌‌‌‌‌‌ (51), మొహమ్మద్‌‌‌‌‌‌‌‌ నైమ్‌‌‌‌‌‌‌‌ (38) జోరుతో ఓదశలో 93/1తో బంగ్లా ఈజీగా గెలిచేలా కనిపించింది. అయితే, నిశాంత్‌‌‌‌‌‌‌‌, మానవ్‌‌‌‌‌‌‌‌ దెబ్బకు  67 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో చివరి తొమ్మిది వికెట్లు కోల్పోయి చిత్తయింది. యశ్‌‌‌‌‌‌‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్‌‌‌‌‌‌‌‌ అవార్డు లభించింది.  ఆదివారం జరిగే ఫైనల్లో పాకిస్తాన్‌‌‌‌‌‌‌‌తో ఇండియా పోటీ పడనుంది. మరో సెమీస్‌‌‌‌‌‌‌‌లో పాక్‌‌‌‌‌‌‌‌ 60 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో శ్రీలంకను ఓడించింది.