మనోళ్లు బ్యాట్లెత్తేశారు.. ఫస్ట్ ఇన్సింగ్స్‎లో 201 పరుగులకే ఇండియా ఆలౌట్‌‌‌‌‌‌‌‌

మనోళ్లు బ్యాట్లెత్తేశారు.. ఫస్ట్ ఇన్సింగ్స్‎లో 201 పరుగులకే ఇండియా ఆలౌట్‌‌‌‌‌‌‌‌

గువాహటి: సొంతగడ్డపై చెత్తాట కొనసాగిస్తున్న టీమిండియా మరో వైట్‌‌‌‌వాష్‌‌‌‌ ముంగిట నిలిచింది. సౌతాఫ్రికాతో రెండో టెస్ట్‌‌‌‌‌‌‌‌లో ఇండియా బ్యాటర్లు బ్యాట్లెత్తేశారు. మార్కో యాన్సెన్‌‌‌‌‌‌‌‌ (6/48) పేస్ దెబ్బకు తోడు స్పిన్నర్‌‌‌‌‌‌‌‌ సైమన్‌‌‌‌‌‌‌‌ హార్మర్‌‌‌‌‌‌‌‌ (3/64) చేసిన దాడిలో హోమ్‌‌టీమ్ లైనప్‌‌‌‌‌‌‌‌ కకావికలమైంది. యశస్వి జైస్వాల్‌‌‌‌‌‌‌‌ (58), వాషింగ్టన్‌‌‌‌‌‌‌‌ సుందర్‌‌‌‌‌‌‌‌ (48) ఓ మాదిరిగా ఆడినా మిగతా వారు ఘోరంగా ఫెయిలయ్యారు.  

ఫలితంగా 9/0 ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ స్కోరుతో సోమవారం మూడో రోజు ఆట కొనసాగించిన ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌లో 83.5 ఓవర్లలో 201 రన్స్‌‌‌‌‌‌‌‌కే ఆలౌటైంది. దాంతో ప్రొటీస్‌‌‌‌‌‌‌‌కు 288 తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ ఆధిక్యం లభించింది. ఫాలో ఆన్‌‌‌‌‌‌‌‌ ఇవ్వకుండా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌ మొదలుపెట్టిన సౌతాఫ్రికా ఆట ముగిసే సమయానికి 8 ఓవర్లలో 26/0 స్కోరు చేసింది. ర్యాన్‌‌ రికెల్టన్‌‌‌‌‌‌‌‌ (13 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌), ఐడెన్‌‌‌‌‌‌‌‌ మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ (12 బ్యాటింగ్‌‌‌‌‌‌‌‌) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం సఫారీలు 314 రన్స్ లీడ్‌‌‌‌‌‌‌‌లో కొనసాగుతున్నారు. 

7 రన్స్‌‌‌‌‌‌‌‌కే 3 వికెట్లు

భారీ లోటుతో మూడో రోజు ఆట మొదలుపెట్టిన ఓవర్‌‌‌‌‌‌‌‌నైట్‌‌‌‌‌‌‌‌ బ్యాటర్లు జైస్వాల్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌ (22) స్టార్టింగ్‌‌‌‌‌‌‌‌లో పెద్దగా ఇబ్బందిపడలేదు. కవర్‌‌‌‌‌‌‌‌ డ్రైవ్స్‌‌‌‌‌‌‌‌, లాఫ్టెడ్‌‌‌‌‌‌‌‌ షాట్స్‌‌‌‌‌‌‌‌తో సఫారీ పేసర్లను దీటుగా ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో తొలి వికెట్‌‌‌‌‌‌‌‌కు 65 రన్స్‌‌‌‌‌‌‌‌ జత చేసి నిలదొక్కుకున్నారు. కానీ స్పిన్నర్ల రాకతో ఆట గమనాన్ని దెబ్బతీశాయి. కేశవ్‌‌‌‌‌‌‌‌ మహారాజ్‌‌‌‌‌‌‌‌ (1/29), హార్మర్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను టర్న్‌‌‌‌‌‌‌‌ చేస్తూ ఒత్తిడి పెంచారు. దీని నుంచి బయటపడేందుకు రాహుల్‌‌‌‌‌‌‌‌ స్వీప్‌‌‌‌‌‌‌‌ షాట్లకు మొగ్గాడు. 

కానీ ఇదే కొంప ముంచింది. తక్కువ వేగంతో కేశవ్‌‌‌‌‌‌‌‌ వేసిన టర్నింగ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ చేయబోయి రాహుల్‌‌‌‌‌‌‌‌ స్లిప్‌‌‌‌‌‌‌‌లో మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. 65/1 వద్ద వచ్చిన సాయి సుదర్శన్‌‌‌‌‌‌‌‌ (15) ఏమాత్రం నిలకడ చూపలేదు. నిర్లక్ష్యమైన షాట్లతో క్రీజులో అసహనంగా కదిలాడు. రెండో ఎండ్‌‌‌‌‌‌‌‌లో జైస్వాల్‌‌‌‌‌‌‌‌ నెమ్మదిగా ఒక్కో రన్‌‌‌‌‌‌‌‌తో ముందుకెళ్లాడు. దాదాపు 10 ఓవర్ల పాటు వికెట్‌‌‌‌‌‌‌‌ కాపాడుకున్నాడు. 

ఈ క్రమంలో 85 బాల్స్‌‌‌‌‌‌‌‌లో హాఫ్‌‌‌‌‌‌‌‌ సెంచరీ చేశాడు. ఇక ఫర్వాలేదనుకున్న టైమ్‌‌‌‌‌‌‌‌లో హార్మర్‌‌‌‌‌‌‌‌ డబుల్‌‌‌‌‌‌‌‌ స్ట్రోక్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో జైస్వాల్‌‌‌‌‌‌‌‌, సుదర్శన్‌‌‌‌‌‌‌‌ను పెవిలియన్‌‌‌‌‌‌‌‌కు పంపాడు. ఈ దశలో బౌలింగ్‌‌‌‌‌‌‌‌కు దిగిన యాన్సెన్‌‌‌‌‌‌‌‌ మరో దెబ్బకొట్టాడు. అతని ఫుల్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను ఆడే క్రమంలో జురెల్‌‌‌‌‌‌‌‌ (0).. మహారాజ్‌‌‌‌‌‌‌‌కు క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. దాంతో 7 రన్స్‌‌‌‌‌‌‌‌ తేడాతో 3 వికెట్లు పడటంతో  95/1తో ఉన్న ఇండియా స్కోరు 102/4గా మారింది. 

యాన్సెన్‌‌‌‌‌‌‌‌ సిక్సర్‌‌‌‌‌‌‌‌

టీ బ్రేక్‌‌‌‌‌‌‌‌ తర్వాత యాన్సెన్‌‌‌‌‌‌‌‌ మరింత రెచ్చిపోయాడు. కచ్చితమైన లైన్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ లెంగ్త్‌‌‌‌‌‌‌‌తో పాటు స్వింగ్‌‌‌‌‌‌‌‌, బౌన్స్‌‌‌‌‌‌‌‌తో చెలరేగాడు. బ్రేక్‌‌‌‌‌‌‌‌ తర్వాత రెండో ఓవర్‌‌‌‌‌‌‌‌లోనే కెప్టెన్‌‌‌‌‌‌‌‌ రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌ (7)ను ఔట్‌‌‌‌‌‌‌‌ చేశాడు. స్కోరు 105/5గా మారింది. ఈ టైమ్‌‌‌‌‌‌‌‌లో జడేజా (6), నితీశ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌ (10) ఇన్నింగ్స్‎ను గాడిలో పెట్టే ప్రయత్నం చేసినా యాన్సెన్‌‌‌‌‌‌‌‌ ముందు సక్సెస్‌‌‌‌‌‌‌‌ కాలేదు. 11 బాల్స్‌‌‌‌‌‌‌‌ తేడాలో ఈ ఇద్దర్ని ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఇండియా 122/7తో పీకల్లోతు కష్టాల్లో పడింది. 

ఇక సుందర్‌‌‌‌‌‌‌‌, కుల్దీప్‌‌‌‌‌‌‌‌ (19) దాదాపు రెండు గంటలసేపు ప్రొటీస్‌‌‌‌‌‌‌‌ బౌలర్లను విసిగించారు. డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ చేస్తూ, సింగిల్స్‌‌‌‌‌‌‌‌ తీస్తూ 35 ఓవర్లు వీళ్లు క్రీజులో పాతుకుపోయారు. ఈ జోడీని విడదీసేందుకు సఫారీ బౌలర్లు చాలా శ్రమించారు. చివరకు హార్మర్‌‌‌‌‌‌‌‌ వేసిన ఔట్‌‌‌‌‌‌‌‌ సైడ్‌‌‌‌‌‌‌‌ బాల్‌‌‌‌‌‌‌‌ను డిఫెండ్ చేయబోయిన సుందర్‌‌‌‌‌‌‌‌ ఫస్ట్‌‌‌‌‌‌‌‌ స్లిప్‌‌‌‌‌‌‌‌లో క్యాచ్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాడు. దాంతో ఎనిమిదో వికెట్‌‌‌‌‌‌‌‌కు 62 రన్స్‌‌‌‌‌‌‌‌ భాగస్వామ్యం ముగిసింది. కొద్దిసేపటికే యాన్సెన్‌‌‌‌‌‌‌‌.. కుల్దీప్‌‌‌‌‌‌‌‌ను, హార్మర్‌‌‌‌‌‌‌‌.. బుమ్రా (5) ఔట్‌‌‌‌‌‌‌‌ చేయడంతో ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌ ముగిసింది.   

సంక్షిప్త స్కోర్లు

సౌతాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 489 ఆలౌట్‌‌‌‌‌‌‌‌, ఇండియా తొలి ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 83.5 ఓవర్లలో 201 ఆలౌట్‌‌‌‌‌‌‌‌ (జైస్వాల్‌‌‌‌‌‌‌‌ 58, సుందర్‌‌‌‌‌‌‌‌ 48, యాన్సెన్‌‌‌‌‌‌‌‌ 6/48, హార్మర్‌‌‌‌‌‌‌‌ 3/64). సౌతాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌‌‌‌‌‌‌‌: 8 ఓవర్లలో 26/0 (రికెల్టన్‌‌‌‌‌‌‌‌ 13 నాటౌట్‌‌‌‌‌‌‌‌, మార్‌‌‌‌‌‌‌‌క్రమ్‌‌‌‌‌‌‌‌ 12 నాటౌట్‌‌‌‌‌‌‌‌).